BigTV English

AP: రిటైర్డ్ ఐఏఎస్ ఐక్యతా యాత్ర.. పొలిటికల్ ఎంట్రీ కోసమేనా?

AP: రిటైర్డ్ ఐఏఎస్ ఐక్యతా యాత్ర.. పొలిటికల్ ఎంట్రీ కోసమేనా?
ias vijay kumar

AP: ఆంధ్రప్రదేశ్‌లో మరో అధికారి రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించబోతున్నారు. జాతీయ సర్వీసులలో పనిచేసిన అధికారులు పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వడం కొత్తమే కాదు. అలాంటి బాటలోనే పయనిస్తున్నారు రిటైర్డు IAS అధికారి. ప్రజల్లోకి వచ్చి బడుగు బలహీన వర్గాల్లో చైతన్యం తెస్తానని చెబుతున్నారు విజయ్‌కుమార్‌. గోదావరి జిల్లాకు చెందిన 2001 బ్యాచ్ మాజీ IAS అధికారి ఈయన. తిరుపతి జిల్లా సూళ్లురుపేట తడ నుంచి ఐక్యత విజయపథం పేరుతో యాత్ర చేపట్టారు. ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుకొండ సబ్ కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో పరిటాల రవితో విబేధించి అప్పట్లో వార్తల్లో నిలిచారు. తర్వాత వివిధ ప్రభుత్వాలలో కీలక పదవులు నిర్వర్తించారు. అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు అనుకూలంగా ఉంటారనే ముద్ర ఉంది.


YCP ప్రభుత్వంలో కీలక శాఖలకు అధిపతిగా విజయ్‌కుమార్‌ పని చేశారు. జిల్లాల విభజనలో కూడా ఈయనదే ప్రముఖ పాత్ర అనే టాక్‌ ఉంది. పదవీ విరమణ తర్వాత కూడా కీలకమైన పదవిలో కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు SC, BCల్లో చైతన్యం నింపడానికి యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. విజయ్ కూమార్‌ అధికార వైసీపీకి సన్నిహితంగా మెలిగిన వ్యక్తిగా పేరుంది. అలాంటి వ్యక్తి ఇప్పుడు పదవి వదులుకొని సామాజక వర్గాలను చైతన్య పర్చాల్సిన అవసరం ఏముందని పొలిటికల్‌ అపోనెంట్స్‌ ప్రశ్నిస్తున్నారు. తిరుపతి, బాపట్ల సీటు అశించి యాత్రను మొదలు పెట్టారనే ప్రచారం ఉంది. ఈ యాత్ర ఆయన కోసమా లేదంటే ఆయన భార్య పొలిటికల్‌ ఎంట్రీ కోసమా అనే ప్రచారం కూడా ఉంది.

బ్యూరోక్రాట్లు రాజకీయాల్లోకి రావడం కొత్త విషయమేమీ కాదు. అయితే చాలా మంది సక్సెస్‌ కాలేకపోతున్నారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో లోక్‌సత్తా జయప్రకాష్ నారాయణ, జేడీ లక్ష్మీ నారాయణ పెద్దగా పాలిటిక్స్‌లో రాణించలేదు. ప్రస్తుతం టీడీపీ HRD విభాగ అధిపతిగా ఉన్న రామాంజనేయులు కూడా సక్సెస్‌ సాధించలేదు. నందికొట్కూరు MLA అర్ధర్, అదే నియోజకవర్గానికి చెందిన మాండ్ర శివానందారెడ్డి, గతంలో టీడీపీ నుంచి మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి CBI అధిపతిగా పనిచేసిన విజయరామరావు లాంటి వారు పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చారు.


విజయ్‌ కుమార్‌ ఎంట్రీపైనా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. తడ నుంచి చేపట్టిన యాత్ర ఎంతమేరకు సక్సెస్‌ కానుందని పొలిటికల్‌ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. యాత్ర మార్గం కూడా వ్యూహాత్మకంగా ఎంచుకున్నారని.. SC సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్న ఏరియాను షెడ్యూల్‌లో చేర్చారని అంటున్నారు.

Related News

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Big Stories

×