BigTV English

Hyderabad Rains: హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. అల్పపీడనం ఎఫెక్ట్..

Hyderabad Rains: హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. అల్పపీడనం ఎఫెక్ట్..

Hyderabad Rains: తెలంగాణలో నిన్న సాయంత్రం నుంచి వర్షాలు దంచికొట్టాయి. ప్రధానంగా హైదరాబాద్ ప్రజలు ఈ వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సికింద్రాబాద్‌, అల్వాల్‌, లింగంపల్లి, కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్‌, సూరారం, బోరబండ ప్రాంతాల్లో వర్షం ప్రతాపం చూపించింది. రహదారులపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్‌ నిలిచిపోయి గంటల తరబడి వాహనాలు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. లింగంపల్లి రైల్వే అండర్‌ పాస్‌లోకి భారీగా వరదనీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయమేర్పడింది.


మంగళవారం సాయంత్రం మొదలైన వర్షం దాదాపు 3 గంటలకి పైగా నాన్‌స్టాప్‌గా కురిసింది. మియాపూర్, చందానగర్ ఏరియాల్లో వాన పడింది. గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం, కొత్తగూడ, తార్నాక, హబ్సిగూడ, నాచారం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్ లో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.

కుత్బుల్లాపూర్ సూరారం కాలనీలో పద్మారావు అనే వ్యక్తి మృతి చెందాడు. ఫుల్ గా మద్యం సేవించి ఇంట్లో పడుకున్నాడు. భారీ వర్షానికి ఆయన ఇళ్లు నీట మునిగింది. దీంతో ప్రమాదంలో ఆయన ఊపిరాడక మృతి చెందాడు.


హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లకుండా అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ సూచనలకు అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ పరిధిలో అన్ని విభాగాల అధికారులు అందుబాటులో ఉండాలని చెప్పారు.

జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్తు విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. రోడ్లపై నీరు నిల్వ లేకుండా చూడాలని, ట్రాఫిక్ ఇబ్బంది, విద్యుత్తు సమస్యలు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రేటర్ సిటీతో పాటు అన్ని జిల్లాల్లో ఎప్పటికప్పుడు వర్షాల పరిస్థితిని సమీక్షించాలని సీఎస్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు.

మరోవైపు అకాల వర్షాలు రైతులను తీవ్ర ఇబ్బందుపాలు చేశాయి. నిన్నంతా పలు జిల్లాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు వర్షం దంచికొట్టింది. దీంతో ధాన్యం కొనుగోలు సెంటర్ల వద్ద ఆరబెట్టిన, బస్తాల్లో నింపిన వడ్లు తడిసి ముద్దయ్యాయి. తడిసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడ్డారు. కళ్లాల్లో ఉన్న వరి కుప్పల్లోకి నీరు చేరింది. కుప్పలపై ప్లాస్టిక్ కవర్స్ కప్పినా వరద కుప్పల్లోకి చేరింది. కొన్ని చోట్ల భారీ ఈదురుగాలులకు కవర్లు కొట్టుకుపోయాయి. దీంతో ధాన్యం తడిసిపోయింది. అధికారులు సరైన ఏర్పాట్లు చేయయకపోవడంతో అకాల వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దయిందని రైతులు అంటున్నారు. కొన్ని చోట్ల వడ్లు వరద ఉధృతికి కోట్టుకుపోయాయి.

లారీల కొరత కారణంగా తూకం వేసిన బస్తాలను.. రైస్ మిల్లులకు చేర్చకుండా కేంద్రాల్లోనే ఉంచడంతో అవి తడిసిపోయాయి. ధాన్యం కొనుగోళ్లు ఆలస్యమవడంతోనే సెంటర్ల వద్ద ఉన్న వడ్లు తడిసిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్ ఒక్కటే కాదు.. ఎప్పుడూ ఇదే సమస్య. అకాల వర్షాలు వచ్చినా.. సీజన్ అయినా.. ఎండబెట్టిన వడ్లు తడవడం, రైతులు నష్టపోతుండడం ఎప్పుడూ జరుగుతూనే ఉంది. అంతకు ముందు తడిసిన ధాన్యం, తేమ ఉన్న ధాన్యం, రంగుమారిన ధాన్యాన్ని కొనే వారు కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక.. కొంత రైతులకు వెసులుబాటు కల్పించింది. తాలు, తప్ప, తేమ, తరుగు వంటి కారణాలు చెప్పొద్దని, రైతుల పంట కొనాలన్నారు. దీంతో అలాగే కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా తడిసిన ధాన్యం కొంటామని రైతులకు అధికారులు హామీ ఇస్తున్నారు.

Also Read: 100 అంతస్తుల సైజు.. 1,000 అణుబాంబుల శక్తి.. భూమిపైకి దూసుకొస్తున్న ముప్పు..!

కొనుగోలు సెంటర్లలో మారాల్సిందేంటి? ఎప్పటికప్పుడు ధాన్యం లిఫ్ట్ చేస్తేనే సమస్యకు పరిష్కారమా ? తగినన్ని టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలా ? లారీల కొరత రాకుండా చూసుకోవాలా.. ఏం చేస్తే సమస్యకు పరిష్కారం?

Related News

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో కుండపోత వానలు పడే ఛాన్స్..

Bathukamma: రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు

Karimnagar Fire Accident: కరీంనగర్‌లోని రీసైక్లింగ్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం

Telangana: ఎమ్మెల్సీ తాతా మధుపై ఖమ్మం జిల్లా నేతల తిరుగుబాటు!

Telangana Farmers: అక్టోబర్ తొలి వారంలోనే.. రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ!

TGPSC Group 2: టీజీపీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. మరో విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. షెడ్యూల్ ఇదే

Kalvakuntla Kavitha: కేసీఆర్ అడ్డాలో కవిత.. సీఎం , సీఎం అంటూ అరుపులు

Medaram Festival: మేడారం జాతరకు సీఎం రేవంత్.. అధికారులకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు

Big Stories

×