BigTV English

Thalliki Vandanam 2025: తల్లికి వందనం స్కీమ్ అప్‌డేట్స్.. ఆ విషయంలో జాగ్రత్త.. లేకుంటే 15వేలు కట్

Thalliki Vandanam 2025: తల్లికి వందనం స్కీమ్ అప్‌డేట్స్.. ఆ విషయంలో జాగ్రత్త.. లేకుంటే 15వేలు కట్

Thalliki Vandanam 2025:  కూటమి సర్కార్ సంక్షేమంపై దృష్టి పెట్టింది. వచ్చే నెలల నుంచి రకరకాల పథకాలను అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. తాజాగా తల్లికి వందనం స్కీమ్ గురించి కీలక అప్ డేట్ బయటకు వచ్చింది. తల్లికి వందనం పథకానికి బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేసుకోవాలని సూచించారు అధికారులు.


చంద్రబాబు సర్కార్ ఏడాది పాటు గత ప్రభుత్వ లోపాలు సరిచేశారు. ఇప్పుడిప్పుడే ప్రభుత్వం గాడిలో పడుతోంది. ఓ వైపు పెట్టుబడులను ఆకర్షిస్తూనే మరోవైపు సంక్షేమంపై ఫోకస్ చేసింది. తాజాగా సూపర్ సిక్స్ పథకాల అమలకు రంగం సిద్ధమైంది. జూన్ నుంచి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ స్కీమలను అమలు చేయనుంది ప్రభుత్వం.

ఈ పథకాలు పొందాలని భావించే కచ్చితంగా బ్యాంకు అకౌంట్‌కు ఆధార్‌ను అనుసంధానం తప్పనిసరి చేసుకోవాలన్నది అధికారుల సూచన. వీటికే కాకుండా సంక్షేమ పథకాల నగదు బదిలీ కోసం తప్పనిసరిగా చేయాల్సిందేనన్నది వారిమాట. ఎన్‌పీసీఐ లింకేజ్ కూడా తప్పనిసరని సూచించారు. చంద్రబాబు సర్కార్ ఇప్పటికే అన్నింటికి టెక్నాలజీని అనుసంధానిస్తుంది. దీనివల్ల నిజమైన లబ్దిదారులకు న్యాయం జరుగుతోంది. ఇదేకాకుండా ప్రభుత్వ సేవలను సైతం చాలావరకు ఆన్ లైన్ చేసింది. ఇప్పుడు స్కీమ్‌ల నిధుల వంతైంది.


తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే ఒక్కొక్కరికి రూ.15వేల చొప్పున ప్రభుత్వం అందిస్తుంది. అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఒక్కొక్కరికి రూ.20వేలు ఇవ్వనుంది. ఈ రెండింటిని జూన్ నుంచి అమలు చేయనుంది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలకు నిధులను లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్‌కు జమ చేస్తారు.

ALSO READ: అలిపిరి మెట్ల మార్గంలో మీరు వెళ్తున్నారా? టీటీడీ కొత్త హెచ్చరికలేంటో?

అందుకోసం ఎన్‌పీసీఐ మేపర్‌‌లో ఆధార్‌‌కు బ్యాంక్‌ అకౌంట్‌ మ్యాపింగ్‌ చేయాల్సివుంటుంది. ఈ ప్రక్రియ కోసం పోస్టల్ డిపార్ట్‌మెంట్, సచివాలయ యంత్రాంగం, ప్రభుత్వ అధికారులు కలిసి పని చేస్తున్నారు. జూన్ 5 లోపు ఆధార్ సీడింగ్‌తోపాటు ఎన్‌పీసీఐ లింకేజ్ చేస్తారు. లబ్దదారులు ఖాతాలను ఓపెన్ చేయడం ద్వారా సంక్షేమ పథకాలు నేరుగా ఆయా కుటుంబాలకు అందనున్నాయి.

ఆధార్ సీడింగ్ జరిగిన ఐపీపీబీ ఖాతాలో జమ కాబడిన డబ్బులను ఏ పోస్టాఫీసులో అయినా తీసుకోవచ్చు. వీలైతే ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్‌లకు వాటిని లింక్ చేసుకోవచ్చు. దీనికితోడు వాటితో ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్, ఎన్‌ఈఎఫ్‌టి, ఐఎంపిఎస్‌, యూపీఐ కూడా చేసుకోవచ్చు. లబ్దిదారులు తమ దగ్గరలోని పోస్టాపీసును సంప్రదించి ఐపీపీబీ అకౌంట్‌కు ఆధార్ సీడింగ్ చేసుకోవాలని సూచించారు అధికారులు.

అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రైతులు ఆధార్ అనుసంధానం తప్పనిసరని తేల్చేశారు అధికారులు. వెబ్ ల్యాండ్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాలన్నారు. రైతు వాస్తవ లబ్ధిదారుగా ఉండాలని ఆదేశించారు. పట్టాదారు పాసు పుస్తకం ఉండి, వెబ్ ల్యాండ్‌లో వివరాలు నమోదు లేనివారు అనుసంధానం తప్పదని తేల్చేశారు.

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×