Rain News: హైదరాబాద్ నగరంలో గత రెండు మూడు రోజుల నుంచి భారీ వర్షం దంచికొడుతుంది. నిన్న సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు నాన్‌స్టాప్‌గా వర్షం కురిసింది. రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు రెండు గంటల సేపు కుండపోత వాన కురిసింది. దీంతో వాహనదారులు, సెకండ్ షిప్ట్ ఉద్యోగం పూర్తి చేసుకున్న ఎంప్లాయ్స్ చాలా ఇబ్బందులు పడ్డారు. నగరంలో రోడ్లపై మోకాళ్ల లోతు వరకు నీళ్లు నిలిచిపోయాయి. వాహనదారులకు ఎక్కడ బొందలు, మ్యాన్ హోల్స్ ఉన్నయో తెలియని పరిస్థితి నెలకొంది. హైటిక్ సిటీ, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్ పేట, పంజాగుట్ట, బేగంపేట, ప్యారడైజ్, సికింద్రాబాద్, తార్నాక, ముషీరాబాద్, నారాయణ గూడ, ఫిల్మ్ నగర్ ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ వాతావరణ శాఖ రాష్ట్ర ప్రజలకు మరోసారి కీలక అప్డేట్ ఇచ్చింది.
ఈ ప్రాంతాల్లో దంచికొట్టిన వాన.. వాహనదారుల ఇక్కట్లు
కాసేపటి క్రితం కూడా భాగ్యనగరంలో పలు చోట్ల కుండపోత వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, అల్వాల్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, పంజాగుట్ట, యూసుఫ్ గూడ, ఫిల్మ్ నగర్, సరూర్ నగర్, మారేడ్ పల్లి, ఉప్పల్, అమీర్ పేట ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. భారీ వర్షాలకు రహదారులు జలమయం అయ్యాయి. రోడ్ల పైకి భారీ వరద నీరు వచ్చి చేరడంతో.. వాహనదారులు, ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు.
ఈ జిల్లాల్లో భారీ వర్షం..
బంగాళఖాతంలో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రోజు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, సూర్యాపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.
కాసేపట్లో ఈ ఏరియాల్లో కుండపోత వాన..
మరి కాసేపట్లో హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరి కొన్ని క్షణాల్లో హైదరాబాద్ నగర వ్యాప్తంగా.. ముఖ్యంగా ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, షేక్ పేట, మాదాపూర్, కూకట్ పల్లి, మియాపూర్, ఆర్సీ పురం, శేరిలింగం పల్లి, కుత్బాల్లాపూర్, బాలానగర్, ఆల్వాల్, గాజుల రామారం, మల్కాజిగిరి, తిరుమలగిరి, కాప్రా, ఎల్బీ నగర్, హయత్ నగర్ ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు వివరించారు.
ALSO READ: APSRTC Notification: ఏపీఎస్ఆర్టీసీలో 281 ఉద్యోగాలు.. మంచి వేతనం.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు