Hyderabad: కాలేజ్‌లో గొడవ పడుతున్న ఇద్దరు విద్యార్థులకు సర్దిచెప్పడానికి బదులు.. ఓ ఉద్యోగి వారిని చితకబాదాడు. ఈ క్రమంలో ఓ విద్యార్థి దవడ పగిలింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని నారాయణ కాలేజ్ గడ్డి అన్నారం బ్రాంచ్‌లో చోటుచేసుకుంది. విద్యార్థుల గొడవ ఆపడానికి వెళ్లిన ఫ్లోర్ ఇంచార్జ్ సతీష్.. కోపంతో ఓ విద్యార్థిని గట్టిగా కొట్టాడు. దీంతో అతడి దవడ విరిగింది. నొప్పితో విలవిల్లాడుతున్న అతడిని ఆస్పత్రికి తరలించారు. దవడ విరగడం వల్ల ఆ విద్యార్థి కొద్ది రోజులపాటు ఆహారం తీసుకోలేడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.