OTT Movie : సైకలాజికల్ థ్రిల్లర్‌లో ఒక మాస్టర్‌పీస్ సినిమాను చూసి చిల్ అవ్వాలనుకుంటున్నారా ? అయితే టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియో నటించిన ఈ మిస్టరీ థ్రిల్లర్ పై ఓ లుక్ వేయండి. ఈ సినిమా ఒక ఐలాండ్‌లోని మానసిక ఆసుపత్రిలో రహస్య కేసును ఛేదించే థ్రిల్లర్ కథ. సస్పెన్స్, సైకలాజికల్ ట్విస్ట్‌లతో ఈసినిమా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా 2010 National Board of Reviewలో టాప్ టెన్ లో చోటు సంపాదించింది. ఈ సినిమా స్టోరీ ఏమిటి ? పేరు ఏమిటి ? ఎందులో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
ఏ ఓటీటీలో ఉందంటే
‘షట్టర్ ఐలాండ్’ (Shutter island) మార్టిన్ స్కార్సెస్ డైరెక్షన్‌లో, డెన్నిస్ లెహానే నవల ఆధారంగా రూపొందిన సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా . ఇందులో లియోనార్డో డికాప్రియో (టెడ్డీ డానియల్స్)మార్క్ రఫ్ఫలో (చక్ ఆల్), బెన్ కింగ్స్లీ (డాక్టర్ కావ్లీ), మిచెల్లె విలియమ్స్ (డోలోరెస్) ప్రధానపాత్రల్లో నటించారు. 2010 ఫిబ్రవరి 19న థియేటర్లలో రిలీజ్ అయ్యి, ప్రస్తుతం Amazon Prime Video, Netflix, Huluలో ఇంగ్లీష్, హిందీ ఆడియోతో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. 2 గంటల 18 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా IMDbలో 8.2/10 రేటింగ్ ను పొందింది.
స్టోరీలోకి వెళ్తే
U.S. మార్షల్ టెడ్డీ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సైన్యంలో ఉంటాడు. ఆతరువాత అతని భార్య డోలోరెస్ మరణం వల్ల బాధపడుతూ ఒంటరిగా ఉంటాడు. కొంతకాలం తరువాత తన కొత్త పార్టనర్ చక్ ఆల్ తో, బోస్టన్‌కు సమీపంలోని షట్టర్ ఐలాండ్‌లో ఉన్న యాష్‌క్లిఫ్ అనే హాస్పిటల్‌కి వెళతాడు. రాచెల్ సోలాండో అనే ఒక రోగి మిస్సింగ్ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికే అక్కడికి చేరుకుంటాడు. ఈ మానసిక ఆసుపత్రిని డాక్టర్ కావ్లీ నడుపుతుంటాడు. ఇక్కడ ప్రమాదకరమైన క్రిమినల్స్ కి చికిత్స చెస్తుంటారు. అయితే ఇప్పుడు టెడ్డీకి ఆసుపత్రిలో డాక్టర్ నీరింగ్ వింతగా కనిపిస్తాడు. రాచెల్ కేసు వెనక ఏదో కుట్ర ఉందని అనుమానిస్తాడు. ఆసుపత్రిలో ల్యాబ్ ఎక్స్‌పెరిమెంట్స్ జరుగుతున్నాయని భావిస్తాడు.
ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగుతుంది. కానీ ద్వీపంలో ఒక తుఫాను రావడం, రాచెల్ గురించి క్లూస్ అస్పష్టంగా ఉండటంతో టెడ్డీ మానసిక స్థితి గందరగోళంగా మారుతుంది. ఈ సమయంలో అతను ఒక గుహలో రాచెల్ ని కలుస్తాడు. ఆమె ఆసుపత్రిలో డాక్టర్లు అక్రమ ప్రయోగాలు చేస్తున్నారని, తన మీద కూడా బలవంతంగా చేశారని చెప్తుంది. ఆతరువాత టెడ్డీకి షాకింగ్ ట్విస్ట్ ఎదురవుతుంది. ఈ హాస్పిటల్ లో మిస్సింగ్ కేసులకు, టెడ్డీ భార్య మరణానికి లింక్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక క్లైమాక్స్ ఎవరూ ఊహించని రీతిలో ముగుస్తుంది. ఇంతకీ రోగులు ఎలా మిస్ అవుతున్నారు ? టెడ్డీ భార్య మరణం వెనుక దాగున్న సీక్రెట్ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ మిస్టరీ థ్రిల్లర్ సినిమాని మిస్ కాకుండా చుడండి.
Read Also :భార్య చర్మం వలిచి ఇదెక్కడి దిక్కుమాలిన పనిరా అయ్యా… చేతబడిని నమ్మనోళ్లు చూడాల్సిన మూవీ