Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు మరో అల్పపీడనం ముప్పు పొంచి ఉంది. సోమవారం వాయుగుండం బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మంగళవారం, బుధవారం వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల్లో వాగులు, చెరువులు పొంగిపోర్లే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తెలంగాణలో ఈ జిల్లాల్లో కుండపోతం వర్షాలు..
తెలంగాణలో మరో వారంపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 8 నుంచి 14 వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, భువనగిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని అంచనా వేసింది.
ఉత్తరాంధ్రకు వర్ష సూచన..
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ ఉత్తరాంధ్రలో వర్షాలు పడతాయని ఏపీ వాతావరణశాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. నిన్న ఉత్తరాంధ్రలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.
పలు జాగ్రత్తలు..
భారీ వర్షాల కారణంగా బయటకు వెళ్లేవారు, రైతులు, వ్యవసాయం కార్మికులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే చెట్లకింద నిలబడకూడదని చెబుతున్నారు.
ఉత్తరాఖండ్ ఉత్తర కాశీలో క్లౌడ్‌బరస్ట్
ఉత్తర భారతాన్ని క్లౌడ్‌బరస్ట్‌లు వణికిస్తున్నాయి. ఉత్తరాఖండ్ ఉత్తరకాశి జిల్లాలోని నౌగాన్ ప్రాంతంలో క్లౌడ్‌బరస్ట్ సంభవించింది. కుండపోత వర్షం, వరదలకు చాలా ఇళ్లు బురదలో కూరుకుపోయాయి. బైకులు కొట్టుకుపోయాయి. క్లౌడ్‌బరస్ట్‌కు ముందే స్థానికులు ఇళ్లను ఖాళీ చేయడంతో ప్రాణాపాయం తప్పింది.
హర్యానా, పంజాబ్‌ను ముంచెత్తుతున్న వర్షాలు..
హర్యానాలోని సిర్సాను భారీ వర్షాలు ముంచెత్తాయి. వీధులు జలమయం అయ్యాయి. ఇళ్లు, దుకాణాల్లోకి వరద నీరు చేరింది. 30వేల ఎకరాలకు పైగా పంట నీట మునిగింది. ఘగ్గర్ నది ఉప్పొంగడంతో కట్టలు తెగి పరిస్థితి మరింత దారుణంగా మారింది. మరిన్నిరోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Also Read: నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవన పనులు ప్రారంభం
ప్రమాదకర రీతిలో ప్రవహిస్తున్న యమునా నది
గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు యమునా నది.. 1963 తర్వాత ఐదవసారి 207 మీటర్ల ఎత్తును దాటింది. నోయిడా, ఘజియాబాద్‌లతోపాటు ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. పంజాబ్‌లోనూ పరిస్థితి దారుణంగా ఉంది. భారీ వర్షాలు, వరదలు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వేలాది ఎకరాల్లో పంటనష్టం జరిగింది. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు.