Gundeninda GudiGantalu Today episode September 8th : నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు మౌనికకు ఇలా జరగడం నాకు చాలా కోపంగా ఉంది. వానికి ఏదో ఒకటి చేస్తాను అని అంటాడు. మీనా సుశీల ఇద్దరూ కలిసి బాలుని కంట్రోల్ చేస్తారు. అయితే ఆ తర్వాత రవి, శృతిలను కూడా సుశీల ఆగండి అని అంటుంది. మీరు ఆవేశపడి ఇలాంటివన్నీ చేస్తే వాడు ఇంకా మౌనికను జన్మలో ఈ ఇంటికి పంపించడు.. రాజేష్ పడకండి వాడు కాస్త తేడాగానే ఉన్నాడు కదా వాడి సంగతి తర్వాత చూద్దాం ముందు ఈ ఫంక్షన్ పని చూడండి అంటుంది. ఉదయం లేవగానే ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది. అందరూ కలిసి సరదాగా ఉంటారు. బాలు మీనాల పెళ్లి రోజుని ఎలాగైనా సరే గ్రాండ్గా చేయాలని అనుకుంటారు. పూజ చేసి బాలు మీనా ఆశీర్వాదం కోసం వస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సత్యం ఇంట్లో అందరు సరదాగా ఉంటారు. ఉదయం లేవగానే ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది. అందరూ కలిసి సరదాగా ఉంటారు. బాలు మీనాల పెళ్లి రోజుని ఎలాగైనా సరే గ్రాండ్గా చేయాలని అనుకుంటారు. పూజ చేసి బాలు మీనా ఆశీర్వాదం కోసం వస్తారు.
ముందుగా సుశీల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత ప్రభావతి సత్యం వద్ద ఆశీర్వాదం తీసుకోవాలని అనుకుంటారు.. సుశీల మీనా నీ దగ్గర తీసుకొని ముద్దు పెట్టు అని అంటుంది. ప్రభావతికి ఇష్టం లేకపోయినా సరే అత్తగారు చెప్పినట్టు వినాలి అని నేను అని దగ్గరికి తీసుకుని ముద్దు పెడుతుంది. బాలు నువ్వు ఇక్కడే ఉండవే నీవల్ల ఇలాంటివి చూడాల్సి వస్తుంది అని అంటాడు. అందరూ కలిసి ప్రభావతిని ఒక ఆట ఆడుకుంటారు. పిల్లాపాపలతో చల్లగా ఉండాలని ప్రభావతి దీవిస్తుంది.
ప్రభావతిని సత్యం గుడి వెళ్లాలని అంటాడు. ప్రభావతి మనం ఎందుకు అంటుంది. కానీ సత్యం మాత్రం మనం కచ్చితంగా గుడికి వెళ్లి పూజ చేయించాలని అంటాడు. వాళ్లు వెళ్ళగానే అందరూ టిఫిన్ చేద్దామని అడుగుతారు. ఏం టిఫిన్ అని మనోజ్ అడుగుతాడు. అలాగే కూడా రవి ఏం టిఫిన్ చేసావు వదిన అని అడుగుతాడు. మీనా పూరి చేశాను అని అంటుంది. నేను ఇంత పొద్దున ఆయిల్ ఫుడ్ అస్సలు తినను అని సంజయ్ అంటాడు. అంత పెద్దగా ఆయిలే ఉండదండి తినండి అని అందరూ అంటున్న సరే నేను తినను నాకు కావాల్సింది నేను ఆర్డర్ పెట్టుకుంటాను అని అంటాడు.
అందరూ కూర్చొని పూరి తింటుండగా సంజయ్ ఆర్డర్ పెట్టిన పిజ్జా వస్తుంది. అయితే ఆఫీస్ అని బాలు ఓపెన్ చేసి దాని మీద కారం ఎక్కువగా వచ్చేలా చల్లి లోపలికి తీసుకుని వెళ్తాడు. ఆ పిజ్జాన్ని చూసి ఆకలేకపోయిన మనోజ్ ఒక విధంగా అంటున్నడంతో సంజయ్ నీకు కావాలా రా ఇద్దరం షేర్ చేసుకుందామని అంటాడు. పిజ్జాని అలా నోట్లో పెట్టుకున్నాడో లేదో కారంతో ఇద్దరు తల క్రిందులుగా తపస్సు చేస్తారు. సంజయ్ మెట్ల మీద కెళ్ళి కారంను తట్టుకోలేక నీళ్లు తాగుతాడు. మనోజ్ పిజ్జాని వామిట్ చేసుకోవడానికి వెళ్తాడు. మొత్తానికి అయితే బాలు సంజయ్ నువ్వు ఆట ఆడుకుంటాడు. పట్టపగలే చుక్కలు చూపిస్తాడు.
Also Read : ఇంటి అద్దె చెల్లించకుండా బెదిరింపులు.. డైరెక్టర్ పై చరణ్ ఫిర్యాదు..
ఆ తర్వాత మీనా బాలుని వాళ్ళ అత్తగారింటికి తీసుకెళ్తుంది. పార్వతి వాళ్ళింట్లో బాలుని మంచిగా చూసుకుంటారు కానీ శివ ముచ్చట రావడంతో బాలు సీరియస్ అవుతాడు. మీరు శివ గురించి తప్పుగా అనుకుంటున్నారు. చాలా మంచోడు బాబు ఇంకా జరిగినవి మర్చిపోండి అని అంటుంది పార్వతి.. ఆ మాట వినగానే బాలు కోపంతో రెచ్చిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లు బాలు షర్టు లేకుండా రావడం చూసి ఇంట్లోది వాళ్ళందరూ షాక్ అవుతారు. ఏంటి వీడు ఉన్న షర్ట్ ని అక్కడ వదిలేసి వచ్చాడు ఏమైంది అని ప్రభావతి అడుగుతుంది. ఇది వాడు కలిసి ఏదో దాస్తున్నారు అందుకే షర్ట్ అక్కడ వదిలేసి వచ్చాడు అని ప్రభావతి అంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..