Big Stories

Mir Osman Ali Khan : ఆ నిజాం ప్రపంచంలోనే బాగా రిచ్.. కానీ పిసినారి.. చివరికి ఏమైందంటే..?

Mir Osman Ali Khan: బ్రిటీష్ ప్రభుత్వానికి అత్యంత విధేయుడిగా మెలిగిన నిజాం నవాబు.. అసఫ్ జా ముజఫరుల్ ముల్క్ సర్ మీర్ ఉస్మాన్ అలీఖాన్. ఆయన 1911లో హైదరాబాద్ సంస్థానం బాధ్యతలు చేపట్టారు. ఆ కాలంలో ఆయనే ప్రపంచంలో అత్యంత ధనవంతుడు. ఈ విషయంపై 1937 ఫిబ్రవరి 22న టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీ కథనాన్ని ప్రచురించింది. హైదరాబాద్ సంస్థానం వైశాల్యం 80 వేల చదరపు కిలోమీటర్లు. ఇది ఇంగ్లండ్, స్కాట్లండ్ దేశాల కంటే పెద్దది.

- Advertisement -

మీర్ ఉస్మాన్ అలీఖాన్ చాలా పిసినారి అని పేరు. ఈ నిజాం నవాబు పొట్టిగా ఉండి వంగి నడిచేవారట. గోధుమరంగు షేర్వానీ,తెల్లటి పైజామా ధరించేవారట. అతిథులకు మితంగా భోజనం వడ్డించేవారట. చాయ్‌, ఒక బిస్కట్లు పెట్టేవారట.ఆయన సన్నిహితులు అమెరికన్,బ్రిటీష్ , టర్కీ దేశస్థులు సిగరెట్ ప్యాకెట్ అందిస్తే వెంటనే నాలుగైదు సిగరెట్లు తీసుకుని తన సిగరెట్ కేసులో పెట్టుకునేవారట. ఆయన మాత్రం నిత్యం చౌకైన చార్మినార్ సిగరెట్లనే కాల్చేవారట.అప్పట్లో 10 సిగరెట్ల ప్యాకెట్ 12 పైసలు.

- Advertisement -

హైదరాబాద్ నిజాం దగ్గర ప్రపంచంలోనే అతిపెద్ద 282 క్యారెట్ల జాకబ్ డైమండ్‌ ఉండేది. మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆచరణ సాధ్యం కాని జీవితం గడిపారు. ఆయన హైదరాబాద్ దాటి ఎప్పుడూ బయటకు రాలేదు. తన మంత్రులు ఎవరినీ కలవలేదు. నిజాం పడకగది మురికిగా ఉండేదట. ఆ గదిలో సీసాలు, సిగరెట్ ముక్కలు, చెత్తచెదారం పడి ఉండేవట. ఆ గదిని ఏడాదికి ఒకసారి నిజాం పుట్టినరోజు నాడు మాత్రమే శుభ్రం చేసేవారట.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత హైదరాబాద్ స్వతంత్ర రాజ్యంగా కొనసాగుతుందని 1947 జూన్ 3న నిజాం నవాబు ప్రకటన జారీ చేశారు. వైస్రాయ్‌కు టెలిగ్రామ్‌ను పంపి హైదరాబాద్ ఎట్టి పరిస్థితుల్లోనూ స్వతంత్ర భారతదేశంలో భాగం కాబోదని స్పష్టం చేశారు. చివరికి భారత సైన్యం హైదరాబాద్‌ మొత్తాన్ని చుట్టుముట్టింది. ఆ సమయంలో నిజాం నవాబు ఈజిప్ట్‌ పారిపోవాలని అనుకున్నారు.
కానీ భారత సైన్యం నవాబు కోటను స్వాధీనం చేసుకుంది.

హైదరాబాద్ సైన్యం లొంగిపోయిన తర్వాత నిజాం మద్దతుదారులు రజ్వీ, లయిక్ అహ్మద్‌లను భారత ప్రభుత్వం నిర్బంధించింది.లయిక్ అహ్మద్ బురఖా సహాయంతో నిర్బంధం నుంచి తప్పించుకుని బొంబాయి విమానాశ్రయం నుంచి కరాచీకి వెళ్లే విమానం ఎక్కేశారు. నిజాం నవాబును ఆయన పరివారాన్ని భారత ప్రభుత్వం ఏమీచేయలేదు. మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు తన రాజభవనంలోనే ఉండేందుకు అనుమతి ఇచ్చింది. ఇప్పటి నుంచి భారత రాజ్యాంగమే హైదరాబాద్ రాజ్యాంగం అవుతుందని నవాబు ఫర్మానా జారీ చేశారు. ఇలా భారతదేశంలో 562వ సంస్థానంగా హైదరాబాద్ విలీనమైంది. నిజాం నవాబుకు భారత ప్రభుత్వం ఏడాదికి 42 లక్షల 85 వేల 714 రూపాయల రాజభరణం ఇచ్చే విధంగా 1950 జనవరి 25న ఒప్పందం కుదిరింది. 1956 నవంబర్ 1 వరకు నిజాం నవాబు హైదరాబాద్ గవర్నర్‌ కు సమానమైన హోదాలో వ్యవహరించారు. 1967 ఫిబ్రవరి 24న నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రాణాలు విడిచారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News