Big Stories

Holi Celebrations: అంబరాన్నంటిన హోలీ సంబరాలు.. ప్రజలకు సీఎం రేవంత్ హోలీ విషెస్..!

- Advertisement -

Holi Celebrations in Telangana: దేశంలో హోలీ సంబరాలు మొదలైయ్యాయి. హైదరాబాద్‌లోనూ వేడుకలు అంబరాన్నంటాయి. వయసుతో తారతమ్యం లేకుండా అంతా రంగులు చల్లుకుని ఎంజాయ్‌ చేస్తున్నారు. పిల్లలు, పెద్దల కేరింతలతో ప్రధాన రోడ్లు, వీధులు సందడిగా మారాయి. ఒకరిపై ఒకరు రంగులు, రంగునీళ్లు చల్లుకుంటూ.. రంగులపండుగను ఆస్వాదిస్తున్నారు. సికింద్రాబాద్, గచ్చిబొలి, హైటెక్ సిటీ, పీపుల్స్ ప్లాజా ప్రాంతాల్లో ప్రత్యేకంగా హోలీ ఈవెంట్లను ఏర్పాటు చేశారు.

- Advertisement -

ఈవెంట్ల నిర్వాహకులు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి.. ఆహా అనిపిస్తున్నారు. సికింద్రాబాద్ తార్నాకలో బల్దియా కార్మికులు జరుపుకున్న హోలీ సంబరాల్లో డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి పాల్గొన్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ అందరూ ఒకటై హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు.

Also Read: స్వామికి ఆగ్రహం వచ్చిందా? ప్రమాదం వెనుక ఏం జరిగింది?

రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. “సప్తవర్ణాల సంబురం రంగుల పండుగ హోళీ. ప్రతి ఒక్కరి జీవితాన వెల్లివిరియాలి ఆనంద కేళి.. ప్రజలందరికీ హోళీ పండుగ శుభాకాంక్షలు.” అని ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. అటు ఏపీలోనూ హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఊరు, వాడ రంగులతో పండుగ చేసుకుంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News