BigTV English

Ujjain’s Mahakaleshwar Temple inside Fire: స్వామికి ఆగ్రహం వచ్చిందా..? ప్రమాదం వెనుక ఏం జరిగింది..?

Ujjain’s Mahakaleshwar Temple inside Fire: స్వామికి ఆగ్రహం వచ్చిందా..? ప్రమాదం వెనుక ఏం జరిగింది..?

ujjain temple latest news


Ujjain’s Mahakaleshwar Temple inside Fire: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో టెంపుల్‌లో ఏం జరిగింది? మహాకాళేశ్వరుని కోపం వచ్చిందా? ప్రమాదం వెనుక కారణాలేంటి? టెంపుల్ వెనుక ఏం జరుగుతోంది? ఇలా సగటు భక్తులను పలు ప్రశ్నలు వెంటాడుతున్నాయి.

మహాకాళేశ్వరుని గర్బగుడిలో సోమవారం ఉదయం భస్మహారతి సమయంలో సడన్‌గా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పూజారితోపాటు 13మందికి గాయాలయ్యాయి. హారతి సందర్భంగా గులాల్ విరజిమ్మిన నేపథ్యంలో మంటలు రేగినట్టు అక్కడున్న భక్తులు చెబుతున్నారు. ముఖ్యంగా హోలీ కావడంతో వేలాది మంది భక్తులు ఆలయంలోనే ఉన్నారు. హోలీ వేడుకను తిలకించేందుకు వచ్చారు.


హారతి సమర్పిస్తున్న సమయంలో పూజారి సంజీవ్ వెనుక నుంచి గులాల్ వెదజల్లడంతోనే ఈ ఘటన జరిగినట్టు భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాన పూజారితోపాటు మరికొందరు ఈ ఘటనలో గాయపడ్డారు. క్షతగ్రాతులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో వారు కోలుకుంటున్నారు. అక్కడే ఉన్న భక్తులు ఫైర్ ఆఫీసుకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, అధికారులు అక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

Also Read: Mobile Recharge: యూజర్లకు బ్యాడ్‌ న్యూస్.. భారీగా పెరగనున్న రీఛార్జ్ ప్లాన్ ధరలు

ఈ ఘటనపై వెంటనే విచారణకు ఆదేశించారు కలెక్టర్. దీనిపై ఓ కమిటీ విచారణ చేయనుంది. భస్మ హారతి సమయంలో మంటలు చెలరేగినట్టు ఆలయ పూజారి ఆశిష్‌గురు వెల్లడించారు. మరోవైపు కొద్దిరోజులుగా టెంపుల్‌లో జరుగుతున్న కార్యక్రమాలపై భక్తులు పెదవి విరుస్తున్నారు. ఆలయ నిర్వాహకులు సరిగా పట్టించుకోదన్న వాదనలూ బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో స్వామి కోపం వచ్చిందని కొందరు భక్తులు చెబుతున్నమాట. మరి విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

Tags

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×