Big Stories

This Week OTT: ఈ వారం థియేటర్/ ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీలు.. సిరీస్‌లు.. ఫుల్ లిస్ట్ ఇదే!

raveena tandon
raveena tandon

This Week OTT Release List: ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా పలు బ్లాక్ బస్టర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీల్లో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అందులో లేటెస్ట్ సూపర్ హిట్ మలయాళం మూవీ ప్రేమలు కూడా స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉంది. ఈ శుక్రవారం అంటే మార్చి 29న గుడ్‌ఫ్రైడే. ఈ సందర్భంగా ఆ రోజు సెలవు కాబట్టి ఈ లాంగ్ వీకెండ్‌ ఓటీటీల్లోని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రెడీగా ఉన్నాయి. అంతేకాకుండా థియేటర్లలో కూడా పలు సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

థియేటర్లలో రిలీజ్ కానున్న సినిమాలు:

- Advertisement -

ది గోట్ లైఫ్ (ఆడు జీవితం):

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటిస్తోన్న మూవీ ‘ది గోట్ లైఫ్’. ఈ మూవీ తెలుగులో ‘ఆడు జీవితం’ పేరుతో తెరకెక్కుతోంది. ఈ సినిమా మార్చి 28న రిలీజ్ కానుంది.

టిల్లు స్క్వేర్:

సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోన్న కొత్త మూవీ ‘టిల్లు స్క్వేర్’. ఈ మూవీకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిసతున్నాడు. ఈ చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

గాడ్జెల్లా vs కాంగ్: ది న్యూ ఎంపైర్:

ఆడమ్ విన్‌గార్డ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కొత్త చిత్రం గాడ్జెల్లా vs కాంగ్: ది న్యూ ఎంపైర్. ఈ మూవీ మార్చి 29న ఇంగ్లీష్‌తో పాటు భారతీయ భాషల్లో రిలీజ్ కానుంది.

Also Read: లోక్‌సభ ఎంపీ సీటుపై కంగనా రియాక్షన్.. ఇకపై ఆ విధంగా పని చేస్తాను

ఓటీటీలోకి వచ్చే సినిమాలు/సిరీస్‌లు:

సుందరం మాస్టర్:

వైవా హర్ష, దివ్య శ్రీపాద జంటగా నటించిన చిత్రం ‘సుందరం మాస్టర్’. ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన అనంతరం ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. మార్చి 28న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

ఏం చేస్తున్నావ్?:

విజయ్ రాజ్ కుమార్ హీరోగా నేహా పటాని హీరోయిన్‌గా నటించిన చిత్రం ఏం చేస్తున్నావ్?. ఈ మూవీ మార్చి 28న ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది.

ప్రేమలు మూవీ:

మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అందుకున్న లేటెస్ట్ మూవీ ప్రేమలు. ఒక చిన్న సినిమాగా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. అంతేకాకుండా భారీ కలెక్షన్లను సైతం రాబట్టింది. అయితే థియేటర్లలో దుమ్ము దులిపేసిన ఈ సినిమా.. తర్వాత తెలుగులోనూ సంచలన విజయం సాధించింది.

ఇక ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసిందుకు సిద్ధంగా ఉంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో శుక్రవారం (మార్చి 29) నుంచి మలయాళంతోపాటు తెలుగుతోనూ ఈ రొమాంటిక్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ కానుంది.

Also Read: తమన్నాతో డేటింగ్ ఎప్పుడు మొదలైందో చెప్పిన విజయ్ వర్మ.. మరి పెళ్లి సంగతేంటి..

ఇన్‌స్పెక్టర్ రిషి:

నవీన్ చంద్ర నటించిన తాజా వెబ్ సిరీస్ ఇన్‌స్పెక్టర్ రిషి. హారర్, క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కింది. సుఖ్‌దేవ్ లహిరి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ తమిళంలో తెరకెక్కింది. అయితే అక్కడ మంచి రెస్పాన్స్ అందుకుని అందరినీ అలరించింది.

అంతేకాకుండా ఇటీవలే ప్రైమ్ వీడియో అనౌన్స్ చేసిన తమ ఒరిజినల్స్‌లో ఈ సిరీస్ కూడా ఒకటి. ఇప్పుడు ఈ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ కావడానికి రెడీగా ఉంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ ఈ శుక్రవారం (మార్చి 29) నుంచి తమిళం, తెలుగు, మరో మూడు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

ట్రూ లవర్ :

తమిళలో సూపర్ హిట్ అందుకున్న మూవీ లవర్. ఈ చిత్రం కూడా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా బుధవారం (మార్చి 27) నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఇక ఎప్పట్నుంచో స్ట్రీమింగ్ వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు తమ అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్‌ను ఖరారు చేసింది.

Also Read: ఈ రోజు టీవీల్లో సందడే సందడి.. ఏకంగా 60కి పైగా సినిమాలు ప్రసారం.. ఇదిగో ఫుల్ లిస్ట్

పట్నా శుక్లా:

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టండన్‌కు మంచి క్రేజ్ ఉంది. ఈ నటి గతంలో కేజీఎఫ్ మూవీలో నటించి మంచి పాపులారిటీ అందుకుంది. అయితే ఇప్పుడు ఈ అమ్మడు ఓ కొత్త సినిమా పట్నా శుక్లాలో నటించింది. బీహార్‌లో జరిగిన ఓ ఎడ్యుకేషన్ స్కామ్ చుట్టూ తిరిగే కథతో ఈ మూవీ రాబోతోంది. ఈ మూవీ ఓటీటీలో ప్రసారం కావడానికి రెడీ అయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ శుక్రవారం (మార్చి 29) నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో:

ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ ది గ్రేట్ ఇండియన్ కపిల్ కొత్త షో రాబోతున్నారు. ఈ షో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చే ఆదివారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. కాగా ఈ షో ప్రతి శనివారం, ఆదివారాల్లో కొత్త ఎపిసోడ్‌లు రానున్నాయి.

లూటేరే:

లూటేరే వెబ్ సిరీస్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సిరీస్ గత శుక్రవారమే (మార్చి 22) ఓటీటీ సంస్థ హాట్‌స్టార్‌లోకి వచ్చింది. అయితే అప్పుడు మొదటి రెండు ఎపిసోడ్లు మాత్రమే హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయ్యాయి. ఇప్పుడు మూడో ఎపిసోడ్ గురువారం (మార్చి 28) నుంచి స్ట్రీమింగ్ కానుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News