Kaleshwaram Pushkaralu: జై శంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో.. మే 15న ప్రారంభమైన సరస్వతి పుష్కరాలు.. అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో మహదేవవూర్-కాళేశ్వరం మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాళేశ్వరం రూట్ వన్-వే మార్గంగా మార్చడంలో 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది.
అయితే ఈ ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి పోలీసులు తీసుకున్న ఆనాలోచిత కారణంగా.. భక్తులు ఐదుగంటల పైగా అడవి మార్గంలో చిక్కుకుపోయి.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనాల రద్దీ సమస్యను నియంత్రించేందుకు పోలీసులు ట్రాపిక్‌ను అడవి ప్రాంతంలోకి మళ్లించారు. ఇది భక్తలను మరింత గందరగోళానికి దారితీయడమే కాకుండా.. అసౌకర్యం కలిగించింది. అడవిలో మళ్లించిన ట్రాఫిక్ వల్ల రోడ్లు అన్ని ఇరుకుగా మారాయి. అదే మార్గంలో లైటింగ్ లేకపోవడం, గూగుల్ మాప్ సరిగ్గా రూట్ సమాచారం ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు భక్తులు, వాహనా దారులు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులతో వచ్చిన వారు తీవ్ర ఇక్కట్లు పడ్డారు.
సరస్వతి పుష్కరాలు ముగింపు దశకు చేరుకోవడంతో.. కాళేశ్వరానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. నిన్న ఒక్కరోజే 2లక్షలుపైగా మంది పుష్కరస్నానం ఆచరించారు. భక్తుల రద్దీకి తగ్గట్టు బస్సుల లేక జనం అవస్థలు పడ్డారు. భారీ సంఖ్యలో వస్తున్న వాహనాలతో ట్రాఫిక్ జాం అవుతోంది. పుష్కరాల్లో పాల్గొనేందుకు గవర్నర్ దంపతులు త్రివేణిసంగమానికి వచ్చారు. మంత్రి శ్రీధర్ బాబు దగ్గరుండి ఏర్పాట్లు చూసుకున్నారు. జిష్ణుదేవ్ వర్మ పుణస్నానాలు ఆచరించారు. గవర్నర్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు.
సరస్వతీ పుష్కర ఘాట్ కు 6కిలో మీటర్ల అవతల వాహనాలను పోలీసులు ఆపుతున్నారు. దీంతో భక్తులు కాలినడకన త్రివేణి సంగమానికి నడిచి వెళ్తున్నారు. రేపటితో పుష్కరాల ముగింపు కావడంతో భారీగా తరలివస్తున్నారు భక్తులు. మహారాష్ట్ర మార్గంలో 4కిలో మీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.
ఉత్తరాదిలో నాలుగు ప్రాంతాలుండగా దక్షిణాదిలో కాళేశ్వరం ఒక్కటే మాత్రమే ఉంది. నది పుట్టిన చోటు ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, ఉత్తర్‌ప్రదేశ్ లోని గంగ, యమున, సరస్వతీ నదుల సంగమం ప్రయాగ్‌రాజ్, గుజరాత్‌లోని సోమనాథ్, రాజస్థాన్‌లోని పుష్కర్‌లో జరగనున్నాయి.
Also Read: మిస్ వరల్డ్ నుంచి నిష్క్రమించిన మిస్ ఇంగ్లాండ్.. తనని అలా చూశారంటూ ఆరోపణ
దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే పానవట్టంపై రెండు శివ లింగాలు (కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి)ఉన్న పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో మాత్రమే ఉంది. రెండు లింగాలకు నిత్యం అభిషేకించిన నీరు.. గోదావరి, ప్రాణహిత నదుల సంగమంలో కలుస్తుంది. దీంతో ఆ ప్రాంతాన్ని సరస్వతి నదిని అంతర్వాహినిగా పిలుస్తారు. సరస్వతి పుష్కరాలు-2025 పేరిట ప్రత్యేక యాప్‌ను తెలంగాణ ప్రభుత్వం రూపొందించింది.