Worst Foods For Brain: మనలో చాలా మంది బయట దొరికే కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడానికి ఇష్టపడుతుంటారు. నిజం ఏమిటంటే కృత్రిమ తీపి పదార్థాలు మన ఆరోగ్యానికి, ముఖ్యంగా మెదడుకు ఏమాత్రం మంచిది కాదు. కొన్ని రకాల పదార్థాలు అస్పర్టేమ్ మెదడు రసాయన శాస్త్రంలో మార్పులతో ముడిపడి ఉందని తేలింది. దీనిపై సైన్స్ ఇంకా ఖచ్చితమైన సమాచారాన్ని అందించలేకపోయినప్పటికీ… చాలా మంది న్యూరాలజిస్టులు దీనిని ఎక్కువగా తీనకూడదని చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, మానసిక రుగ్మతలు ఉన్నవారు సోడా తాగే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం ముఖ్యం.
చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారాలు:
చక్కెర అధికంగా ఉండే డ్రింక్స్, స్వీట్లు , బేకరీ ఐటమ్స్ మెదడు ఆరోగ్యానికి హానికరం. అధికంగా చక్కెర తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోస్ స్థాయిలు పెరుగుతాయి. అంతే కాకుండా ఇది మెదడులో ఒత్తిడిని కలిగిస్తుంది. దీర్ఘకాలంలో.. ఇది జ్ఞాపకశక్తి కోల్పోవడంతో పాటు అల్జీమర్స్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.
ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న ఆహారాలు:
ఫాస్ట్ ఫుడ్, ఫ్రైడ్ ఆహారాలు, ప్యాకేజ్డ్ స్నాక్స్‌లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ మెదడు కణాలను దెబ్బతీస్తాయి. ఇవి మెదడులో రక్త ప్రవాహాన్ని తగ్గిస్తాయి. అంతే కాకుండా నాడీ వ్యవస్థ పనితీరును దెబ్బతీస్తాయి. ఫలితంగా ఏకాగ్రత, ఆలోచనా సామర్థ్యం తగ్గుతుంది.
ప్రాసెస్డ్ ఆహారాలు:
చిప్స్, ఇన్‌స్టంట్ నూడుల్స్ వంటి ప్రాసెస్డ్ ఆహారాలలో కృత్రిమ సంరక్షకాలు, రంగులు, రుచి కోసం కలిపిన రకరకాల పదార్థాలు ఉంటాయి. ఇవి మెదడులో ఆక్సీకరణ ఒత్తిడిని పెంచి, న్యూరాన్లను దెబ్బతీస్తాయి. ఇది మానసిక స్పష్టతను తగ్గిస్తుంది.
అధిక ఉప్పు ఉన్న ఆహారాలు: ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలు రక్తపోటును పెంచుతాయి. ఇది మెదడుకు రక్త సరఫరాను తగ్గిస్తుంది. స్ట్రోక్ లేదా ఇతర మెదడు సంబంధిత సమస్యల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
Also Read: జామ ఆకులను ఇలా వాడితే.. తలమోయలేనంత జుట్టు
ఆల్కహాల్:
అతిగా ఆల్కహాల్ తీసుకోవడం మెదడు కణాలను నాశనం చేస్తుంది. అంతే కాకుండా ఇది జ్ఞాపకశక్తి, నేర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. దీర్ఘకాలంలో.. ఇది మెదడు పరిమాణాన్ని తగ్గించి, డిమెన్షియా ప్రమాదాన్ని పెంచుతుంది.
మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ ఆహారాలను తగ్గించి, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు అధికంగా ఉన్న ఆహారాలను ఎంచుకోవాలి. సమతుల ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.
Also Read: మందార పూలను ఇలా వాడితే.. చందమామ లాంటి చర్మం మీ సొంతం