E-Paper
Advertisement

పిల్లలు చూస్తుండగానే.. భార్యని ఆ పని చేసిన భర్త, రంగారెడ్డి జిల్లాలో ఘటన

పిల్లలు చూస్తుండగానే..  భార్యని ఆ పని చేసిన భర్త, రంగారెడ్డి జిల్లాలో ఘటన
Advertisement

Rangareddy District: వారిద్దరు భార్యభర్తలు. ఎంతో ముచ్చటగా ఉండేవారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నాయి. అయినా భర్తకు ఏదో చిన్న అనుమానం. అది కాస్త పెనుభూతంగా మారింది. ఫలితంగా భార్యాభర్తల మధ్య గొడవలకు దారి తీసింది. కోపంతో తట్టుకోలేక పిల్లల ముందు భార్యని అత్యంత దారుణంగా చంపేశాడు భర్త. సంచలనం రేపిన ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది.

రంగారెడ్డి జిల్లాలో దారుణమైన ఘటన

రంగారెడ్డి జిల్లా జల్‌పల్లిలోని న్యూబాబానగర్‌లో ఉంటున్నారు ముస్తఫా-అజ్మీరా దంపతులు ఉంటున్నారు. ఈ జంటకు ముగ్గురు సంతానం ఉన్నారు. తాను పనికి బయటకు వెళ్లిన సమయంలో భార్య మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని అనుమానం పడేవాడు. ఆ అనుమానం కాస్త పెనుభూతంగా మారింది. ఫలితంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలన్న ఈ జంట మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి.

పిల్లలు చూస్తుండగా భార్యని గొంతు కోసిన భర్త

Advertisement

పిల్లల ముందు పలుమార్లు భార్యని కొట్టిన సందర్భాలు ఉన్నాయి. సోమవారం రాత్రి ఇంటికి వచ్చిన ముస్తఫా, భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ముస్తఫాకు భార్య ఎదురు సమాధానం చెప్పడంతో తట్టుకోలేకపోయాడు. ఆ సమయంలో ఆకలి అంటూ పిల్లలు ఏడుస్తూ చూస్తుండగానే కనికరం లేకుండా భార్య గొంతు కోశాడు. భార్య రక్తపు మడుగులో పడిపోయింది, తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితురాలు అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.  నిందితుడు ముస్తఫా.. తన సెల్‌ఫోన్‌ని ఇంట్లోనే పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. చిన్నారులు అమ్మ అంటూ ఏడుస్తుండడం గమనించిన ఇరుగుపొరుగువారు అప్రమత్తమై బాలాపూర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

గంటల వ్యవధిలో నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు

బాలాపూర్- పహాడీషరీఫ్‌ పోలీసులు శ్రీశైలం మార్గంలో ఉమ్మడిగా పెట్రోలింగ్‌ చేపట్టారు. ఫొటోను బట్టి నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ముస్తఫాను పోలీసులు కొన్ని గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. విగతజీవిగా పడి ఉన్న తల్లిని చూసి చిన్నారులు ఏడుస్తుండడం అక్కడివారిని కంటతడి పెట్టించింది. తండ్రి జైలుపాలు కావడంతో ఆ ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Advertisement

ALSO READ: మరీ ఇంత అవినీతా.. రూ.20 లక్షల లంచంతో ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్!

Related News

కన్న కూతురిపై తండ్రి.. భర్తను చెట్టుకు కట్టేసి భార్య ఏం చేసిందంటే.. సిద్ధిపేటలో దారుణం!

మరీ ఇంత అవినీతా.. రూ.20 లక్షల లంచంతో ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్!

గద్వాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బిగ్ షాక్.. వెంచర్ రాళ్లు తొలగింపు!

రూ.413 కోట్లతో చర్లపల్లి టెర్మినల్ నిర్మించిన కేంద్రం.. కానీ ఆ చిన్న తప్పుతో అంతా జీరో..?

ఫార్ములా-ఈ రేస్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఏసీబీ కోర్టులో కేటీఆర్ డిశ్చార్జ్ పిటిషన్!

మహిళలకు కవిత బంపరాఫర్.. అధికారంలోకి వస్తే 50% రిజర్వేషన్లకు హామీ!

ఉక్రెయిన్ యుద్ధంలో జగిత్యాల వాసి మృతి.. కుటుంబాన్ని ఆదుకున్న సీఎం రేవంత్!

Big Stories

Advertisement
×