E-Paper
Advertisement

శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. నలుగురు మృతి
Advertisement

Vijayawada Accident: సంతోషంగా శుభకార్యానికి వెళ్లిన ఆ కుటుంబం, తిరిగి ఇళ్లకు చేరుకునే వేళ విధి చిన్నచూపు చూసింది. ఇంకో పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటామనే ఆనందం క్షణాల్లో కన్నీటి సంద్రమైంది. విజయవాడ బైపాస్‌పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నలుగురి ప్రాణాలను బలిగొని, ఒక కుటుంబాన్ని కన్నీటి పర్యంతం చేసింది.

ప్రమాదం ఎలా జరిగింది?

Advertisement

విజయవాడ శివారు నున్నకు చెందిన కొమ్మారెడ్డి రామ్‌దేవ్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో నంబూరులోని శుభకార్యానికి వెళ్లి సాయంత్రం తిరిగి వస్తున్నారు. గొల్లపూడి దాటి గన్నవరం వైపు వెళ్తుండగా బైపాస్ వద్ద మలుపులో కారు అదుపుతప్పింది. రోడ్డు మూడు వరుసలు దాటుకుంటూ వెళ్లి ఎడమ వైపు ఉన్న గోడను బలంగా ఢీకొట్టింది. ఈ తీవ్రతకు తల్లి అరుణ కారులో నుంచి ఎగిరి రోడ్డుపై పడి ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు స్పందించి ఇతరులను బయటకు తీసేసరికే రామ్‌దేవ్‌తో పాటు మరో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఆ వెంటనే కారు కూడా పూర్తిగా కాలిపోయింది. తీవ్రంగా గాయపడిన మరో మహిళ తియగూరు అరుణ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

పోలీసుల నిర్లక్ష్యం.. అధికారుల స్పందన

Advertisement

సమయానికి స్పందించాల్సిన పోలీసులు సరిహద్దుల వివాదంతో కాలయాపన చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. సాయంత్రం 5:30 గంటలకు ప్రమాదం జరిగితే, ఏ పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తుందో తేలడానికే గంటన్నర సమయం పట్టింది. చివరకు ఇబ్రహీంపట్నం పోలీసులు వచ్చి పంచనామా నిర్వహించారు. మరోవైపు ఈ పెను విషాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేశ్, సత్యకుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిమిషాల వ్యవధిలో జరిగిన ఈ అనూహ్య ఘటన నున్న ప్రాంతంలో తీవ్ర విషదాన్ని నింపింది.

Also Read: పిల్లలు చూస్తుండగానే.. భార్యని ఆ పని చేసిన భర్త, రంగారెడ్డి జిల్లాలో ఘటన

Tags

Related News

ఏపీకి దసరా ముసురు.. అండమాన్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం, అల్పపీడనంగా మారే ఛాన్స్

‘లోకల్’పై కూటమి పార్టీల తర్జనభర్జన.. మంగళవారం మరోసారి భేటీ, తేలకుంటే ఫ్రెండ్లీ పోటీకి అవకాశం

తిరుమలలో భక్తుల కష్టాలకు చెక్.. ఇక మీ వెంట వెంకటాద్రి, ఇంకెందుకు ఆలస్యం

విజయనగరం పైడితల్లి ధ్యాత్మిక సందడి.. సిరిమాను తయారీ ఎలా జరుగుతుందో తెలుసా?

ఏపీ మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల జాబితా విడుదల.. పూర్తి జాబితా ఇదే!

తిరుపతికి చంద్రబాబు భారీ వరాలు.. రూ.3,222 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం!

బీసీల ఎదుగుదల జగన్‌కు ఇష్టం లేదు: మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి

Big Stories

Advertisement
×