E-Paper
Advertisement

రోజురోజుకు ముదురుతున్న డంపింగ్ యార్డ్ వివాదం.. పట్టించుకోని ప్రభుత్వం

రోజురోజుకు ముదురుతున్న డంపింగ్ యార్డ్ వివాదం.. పట్టించుకోని ప్రభుత్వం
Advertisement

Dumping Yard: స్వేచ్ఛ బ్యూరో: హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వేదికగా సాగుతున్న డంపింగ్ యార్డ్ వ్యతిరేక ఉద్యమం ఎనిమిదవ రోజుకు చేరుకుంది. సిర్సపల్లి సరిహద్దులో, జనవాసాల మధ్య ప్రభుత్వం ఏర్పాటు చేయదలచిన ఈ యార్డును వ్యతిరేకిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దీక్షకు సోమవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాసిం హాజరై తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఆయన రాకతో ఉద్యమకారుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

హుజురాబాద్ చైతన్యానికి ప్రొఫెసర్ కాసిం నీరాజనం..

ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ప్రొఫెసర్ కాసిం భావోద్వేగంగా ప్రసంగించారు. “హుజురాబాద్ అంటేనే చైతన్యానికి మారుపేరు. మొదటి నుంచి ప్రజా పక్షాన నిలబడి పోరాటాలు చేయడం, సామాజిక బాధ్యతగా గొంతు వినిపించడం ఇక్కడి పౌర సమాజం మరియు మధ్యతరగతి ప్రజల డీఎన్ఏలోనే ఉంది” అని కొనియాడారు. డంపింగ్ యార్డ్ వల్ల రాబోయే ముప్పును ముందే పసిగట్టి ప్రజలు చేస్తున్న ఈ పోరాటం సరైనదని ఆయన సమర్థించారు.

జవహర్ నగర్ చేదు పాఠం: కళ్లు తెరవని ప్రభుత్వాలు

Advertisement

డంపింగ్ యార్డుల వల్ల కలిగే వినాశనాన్ని వివరిస్తూ హైదరాబాద్‌లోని జవహర్ నగర్ ఉదాహరణను ఆయన కళ్లముందు ఉంచారు. “జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వల్ల అక్కడి గాలి, నీరు విషతుల్యమయ్యాయి. వనపర్తి, కరీంనగర్, నల్గొండ వంటి జిల్లాల నుంచి వచ్చి అక్కడ స్థిరపడిన పేద ప్రజలు నేడు భయంకరమైన వ్యాధులతో అల్లాడుతున్నారు. గత 20 ఏళ్లలో నాలుగు ప్రభుత్వాలు మారినా, ‘శుద్ధి చేస్తాం’ అనే మాటలే తప్ప ఆచరణలో ఏ పార్టీ కూడా స్పష్టమైన పరిష్కారం చూపలేదు” అని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమకారుడు ఆకుల భూమయ్య మరణాన్ని ప్రస్తావిస్తూ, చెత్త లారీల వల్ల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను ఆయన గుర్తు చేశారు. హుజురాబాద్ వంటి పచ్చని పంట పొలాలు, విద్యా కేంద్రాలు ఉన్న నగరం రేపు చెత్తకు నిలయంగా మారితే ప్రజల భవిష్యత్తు అంధకారమవుతుందని హెచ్చరించారు.

Also Read: Tax Disparity: బీజేపీ యేతర రాష్ట్రాలపై కేంద్రం సవతి తల్లి ప్రేమ: మంత్రి జూపల్లి

ప్రభుత్వానికి హితవు: సాంకేతికతను వాడండి

Advertisement

ప్రస్తుతం AI (కృత్రిమ మేధస్సు) వంటి అత్యాధునిక సాంకేతికత అందుబాటులో ఉన్న కాలంలో, ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం సరికాదని ప్రొఫెసర్ కాసిం ప్రభుత్వానికి హితవు పలికారు. డంపింగ్ యార్డులను జనావాసాలకు కనీసం 20 కిలోమీటర్ల దూరంలో, పంట పొలాలకు నష్టం కలగని నిరుపయోగ భూముల్లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వెంటనే ఈ నియోజకవర్గంపై దృష్టి సారించి, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.

కదం తొక్కిన నాయకులు.. గ్రామస్తులు

ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు ఈశ్వర్ రెడ్డి, రత్నం, వేల్పుల ప్రభాకర్, సామాజిక కార్యకర్త జైపాల్ రెడ్డి, సిర్సపల్లి గ్రామస్తులు శ్రీనివాస్ మరియు వివిధ దళిత, బీసీ, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు.అనంతరం ఎమ్మార్వో కు వినతిపత్రం సమర్పించారు.

Also Read: కల్తీ గ్యాంగులకు సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్.. నెక్స్ట్ టార్గెట్..?

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×