BigTV English

HYD Biryani Record: హైదరాబాద్ బిర్యానీ రికార్డు.. ఏడాదిలో కోటి బిర్యానీలు తినేశారు..

HYD Biryani Record: హైదరాబాద్ బిర్యానీ రికార్డు.. ఏడాదిలో కోటి బిర్యానీలు తినేశారు..
HYD Biryani Record

HYD Biryani Record(Hyderabad latest updates):

బిర్యానీ అంటే మాకు వ్యసనం కాదు.. అలవాటు పడిన ఓ సంప్రదాయం.. ఇదో ఎమోషన్.. హైద్రాబాద్ బిర్యానిపై నగరవాసుల ఒపీనియన్ ఇది. అయితే.. ఈ బిర్యానీ క్రేజ్ హైద్రాబాద్, తెలంగాణకే పరిమితం కాలేదు. విదేశాలకు కూడా పాకింది. భాగ్యనగారానికి వచ్చిన విదేశీ టూరిస్టులు.. చార్మినార్ ను చూసి అక్కడే ఏదో ఒక సందులో బిర్యానీని టేస్ట్ చేసిన తర్వాతే రిటర్న్ టూర్ ప్లాన్ చేస్తారు.


అలాంటి ఈ క్రేజీ బిర్యానీ ఓ రికార్డ్ సొంతం చేసుకుంది. కోటికిపైగా ఆర్డర్లు పొందిన వంటకంగా దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది. 2023లో మొదటి ఆరు నెలల్లోనే హైదరాబాద్‌ వాసులు 72 లక్షలకుపైగా బిర్యానీలు తిన్నారని స్విగ్గీ సంస్థ తెలిపింది. తర్వాతి ఆరు నెలల్లో ఈ నెంబర్ డబుల్ అయింది. మరో ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే.. ఆన్‌లైన్‌ ఆర్డర్లలో ప్రతి ఆరో ఆర్డర్‌ బిర్యానీయే ఉందని స్విగ్గీ తెలిపింది. ఆన్‌లైన్‌లో చాలా వస్తువులు ఆర్డర్ చేస్తాం. అందులో ప్రతీ ఆరు వస్తువుల్లో ఒక బిర్యానీ అంటే చిన్న విషయం కాదు.

స్విగ్గీ మరికొన్ని ఇంట్రస్టింగ్ విషయాలను కూడా చెప్పింది. ఈ సంవత్సరంలో ఓ వ్యక్తి ఏకంగా 16 వందల 33 బిర్యానీలు ఆర్డర్‌ ఇచ్చారు. అంటే.. ఆ వ్యక్తి ప్రతీ రోజు నాలుగు లేదా ఐదు బిర్యానీలు ఆర్డర్ చేశారు. ఇక నగరంలో కూకట్‌పల్లివాసులు ఎక్కువగా బిర్యానీపై మనసు పారేసుకున్నారని స్విగ్గీ లెక్కలు చెబుతున్నాయి. నెక్స్ట్ ప్లేస్‌లో మాదాపూర్‌, బంజారాహిల్స్‌, గచ్చిబౌలి వాసులున్నారు.


.

.

Tags

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×