E-Paper
Advertisement

‘షాహిద్ అఫ్రిది’ను వాడుకుని గ్యాంగ్‌స్టర్ ఆట క‌ట్టించిన‌ పంజాబ్

‘షాహిద్ అఫ్రిది’ను వాడుకుని గ్యాంగ్‌స్టర్ ఆట క‌ట్టించిన‌ పంజాబ్
Advertisement

Punjab Police-Shahid Afridi:  పంజాబ్ గ్యాంగ్ స్టార్ గుర్విందర్ సింగ్ అలియాస్ అఫ్రిదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇథియోపియాలో అతన్ని అరెస్టు చేసి.. దీపావళి రోజున దేశ రాజధాని ఢిల్లీకి తీసుకువచ్చారు. ఆ తర్వాత గ్యాంగ్ స్టార్ గుర్విందర్ సింగ్ ను పంజాబ్ పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. గతంలో అఫ్రిదిపై ఐదు లక్షల రివార్డు కూడా పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు ఆపరేషన్ షాహిద్ పేరుతో పంజాబ్ పోలీసులు పది నెలల పాటు అంతర్జాతీయ స్థాయిలో నిఘాను కొనసాగించారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఆటగాడు షాహిద్ అఫ్రిది పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

షాహిద్ అఫ్రిది, గ్యాంగ్‌స్టర్ గుర్విందర్ కు ఏం సంబంధం?

దాదాపు 30 కేసుల్లో నిందితుడిగా ఉన్న పంజాబ్ గ్యాంగ్ స్టార్ గుర్విందర్ సింగ్ అలియాస్ అఫ్రిది అరెస్ట్ అయిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి ప్రత్యేక కారణం ఉంది. తన చిన్నతనం నుంచి క్రికెట్ పైన గుర్విందర్ సింగ్ ఆసక్తి చూపించేవాడు. కేసులు కాక ముందు పంజాబ్ లోని తరణ్ తార‌ణ్ జిల్లాకు స్థానికంగా గుర్విందర్ సింగ్ క్రికెట్ ఆడేవాడు. పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ ఆఫ్రిది లాగానే క్రీజు దాటి ముందుకు వచ్చి భారీ సిక్సర్లు బాదేవాడు. వికెట్లు కూడా తీసేవాడు. అందుకే అతన్ని ముద్దుగా షాహిద్ అఫ్రిది అనిపించేవారు. దాన్ని గొప్ప‌గా భావించి అఫ్రిది పేరును కొన‌సాగించాడు.
ఈ క్రమంలోనే పోలీసులు కూడా ‘ఆప‌రేష‌న్ షాహిద్’ అని నామకరణం చేశారు.

Advertisement

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

క్రిమినల్ గా ఎందుకు మారాడంటే ?

స్థానికంగా ఉన్న గొడవల కారణంగా గుర్వింద‌ర్ సింగ్ గ్యాంగ్ స్ట‌ర్ గా మారాడు. ఈ క్రమంలోనే తనకు ఇష్టమైన అఫ్రిది పేరును కూడా వదులుకోలేదు. అందరికీ ఆఫ్రిది గానే పరిచయం అవుతూ వ్యాపారవేత్తలను కూడా భయపట్టించేవాడు. ఫోన్లు చేసి బెదిరించాడు. కిడ్నాప్ లు, మర్డర్లు, దొంగ‌త‌నాలు అబ్బో చెప్పుకుంటూ పోతే ఎన్నో చేసేవాడు. అయితే ఇతన్ని పట్టుకునేందుకు నెలల పాటు ‘ఆప‌రేష‌న్ షాహిద్’ నిర్వహించి తాజాగా ఇథియోపియాలో అరెస్టు చేసింది. నివేదికల ప్రకారం పంజాబ్ యాంటీ గ్యాంగ్ స్టార్ టాస్క్ ఫోర్స్ 10 నెలల పాటు అంతర్జాతీయ స్థాయిలో నిఘా పెట్టింది. ఈ క్రమంలో ఇథియోపియా నుంచి అతన్ని ఇండియాకు డిపోర్టు చేయించి అదుపులోకి తీసుకుంది. ఆఫ్రికా ఖండం నుంచి ఒక గ్యాంగ్ స్టార్ ను విజయవంతంగా రప్పించడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు.

Advertisement

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

 

 

Related News

ఆర్య‌వీర్ సెహ్వాగ్ సెంచ‌రీ…బ్యాట్ లో స్ప్రింగులు ఉన్నాయంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

భారీ వ‌ర్షంతో మూడో వ‌న్డే ర‌ద్దు..టీమిండియా, కివీస్ సిరీస్ పై విచార‌ణ చేయాలంటూ?

టీమిండియాను ఓడించిన పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌కు PKR 15,000 రివార్డు

ఐపీఎల్ లో మరో రెండు కొత్త జట్లు…బీసీసీఐకి రూ.16,600 కోట్ల లాభం?

శ‌భాష్ కావ్య‌… ఆమె దెబ్బ‌కు చెన్నై, ఢిల్లీ జ‌ట్లు స‌గం చ‌చ్చిపోయాయి

వైభ‌వ్ కార‌ణంగా య‌శ‌స్వి జైస్వాల్ ను ఓ పిచ్చికుక్కలా రాజ‌స్థాన్ చూస్తోంది!

హార్దిక్ పాండ్యా అడుగే దరిద్రం…పంజాబ్ కింగ్స్ ప్లేయర్లు తన్నుకు చావడం గ్యారెంటీ!

Big Stories

Advertisement
×