E-Paper
Advertisement

Collector Harichandana: ప్రజా అర్జీలపై అధికారులు సత్వరమే స్పందించాలి : కలెక్టర్ హరిచందన దాసరి

Collector Harichandana: ప్రజా అర్జీలపై అధికారులు సత్వరమే స్పందించాలి :  కలెక్టర్ హరిచందన దాసరి
Advertisement

Collector Harichandana:  ప్రజావాణి అర్జీలపై అధికారులు సత్వరమే స్పందించి, జాప్యం చేయకుండా వాటిని పరిష్కరించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి (Collector Harichandana) అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) జితేందర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఈ. వెంకటాచారి లతో కలిసి పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా క‌లెక్ట‌ర్ హరిచందన మాట్లాడుతూ ప్రజా ఆర్జీలపై అధికారులు ఆర్జీలు, దరఖాస్తులను శాఖల వారీగా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. సీఎం ప్రజావాణికి, వాట్సాప్ ద్వారా వృద్ధులు చేసుకున్న దరఖాస్తులకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలని సూచించారు.

Also Read: Minister Vakiti Srihari: యువతను క్రీడల వైపు మళ్లించడమే.. ప్రభుత్వ లక్ష్యం.. మంత్రి వాకిటి శ్రీహరి

అర్జీలపై సమీక్షించి వాటికి వేగవంతంగా పరిశీలించాలి 

Advertisement

ఇంకా పరిష్కరించకుండా పెండింగ్ లో ఉన్న అర్జీలపై సమీక్షించి వాటికి వేగవంతంగా పరిశీలించాలని సూచించారు. ప్రజావాణిలో హౌజింగ్ శాఖ 189, (డబుల్ బెడ్ రూమ్ – 15, ఇందిరమ్మ ఇండ్లు- 174), రెవెన్యూ 82, ఇతర శాఖలు 6 క‌లిపి మొత్తం 277 ఆర్జీలు అందాయని క‌లెక్ట‌ర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఓ డా. సురేందర్, ప్రాజెక్ట్ డైరెక్టర్ (హౌజింగ్) అశోక్ చక్రవర్తి, రెవెన్యూ డివిజనల్ అధికారి రామకృష్ణ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి, స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ జ్యోతి, జిల్లా సంక్షేమ శాఖ అధికారులు ఆశన్న, ప్రవీణ్ కుమార్ , ఇలియాస్ అహ్మద్ ,కోటాజి, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ పవన్ కుమార్, జిల్లా అధికారులు, ఆర్జీదారులు, తదితరులు పాల్గొన్నారు.

Also Read: Harish Rao: మన ఊరు – మన బడి బకాయిలు వెంటనే చెల్లించాలి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్ రావు డిమాండ్

Related News

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

ముక్కు మూసుకుని బతుకమ్మ నిమజ్జనం చేసిన మహిళలు.. ఎందుకో తెలుసా..?

Big Stories

Advertisement
×