E-Paper
Advertisement

Minister Vakiti Srihari: యువతను క్రీడల వైపు మళ్లించడమే.. ప్రభుత్వ లక్ష్యం.. మంత్రి వాకిటి శ్రీహరి

Minister Vakiti Srihari: యువతను క్రీడల వైపు మళ్లించడమే.. ప్రభుత్వ లక్ష్యం.. మంత్రి వాకిటి శ్రీహరి
Advertisement

Minister Vakiti Srihari: యువతను మత్తు నుంచి దూరంగా ఉంచి క్రీడామైదానాల వైపు మళ్లించడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. 2వ విడత సీఎం కప్ పోటీలు సోమవారం ముగిశాయి. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ముగింపు వేడుకల్లో సినీ నటుడు రాహుల్ బోస్ హాజరై క్రీడాకారులకు బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీడల ద్వారా శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం, క్రమశిక్షణ పెంపొందుతాయని పేర్కొన్నారు. సీఎం కప్ పోటీలు ప్రతి సంవత్సరం నిరంతరంగా నిర్వహించబడతాయని వెల్లడించారు. తెలంగాణ గ్రామీణ క్రీడారంగాన్ని మరింత బలోపేతం చేయడం, గ్రామీణ ప్రాంతాల్లోని మట్టిలో మాణిక్యాలైన ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి రాష్ట్ర, జాతీయ స్థాయిలకు తీసుకెళ్లడం లక్ష్యమని పేర్కొన్నారు.

Advertisement

Also Read: Army Dog Tyson: కశ్మీర్‌లో ఆశ్చర్యం.. శునకం కంటపడి.. ప్రాణాలు పోగొట్టుకున్న పాక్ ఉగ్రవాదులు!

సీఎం కప్–2025 ద్వారా రాష్ట్రవ్యాప్తంగా క్రీడా వాతావరణం మరింత బలపడిందని, గ్రామీణ యువతలో అపార ప్రతిభ దాగి ఉందని ఈ పోటీలు స్పష్టంచేశాయని మంత్రి అన్నారు. క్రీడా రంగ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సీఎం కప్ ఒక ముఖ్య మైలురాయిగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో ఎల్బీ స్టేడియంలో డిప్యూటీ డైరెక్టర్ రవీందర్, స్టేడియం అడ్మినిస్ట్రేటర్ రవికుమార్ తదితరులు పాల్గొని విజేతలను సన్మానించారు.

Advertisement

Also Read: Best Time to Use AC: ఈ సమయాల్లో ఏసీ వేయొద్దు.. అలా చేస్తే ఈ రెండు నష్టాలు తప్పవు!

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×