E-Paper
Advertisement

Hyderabad News: అర్ధరాత్రి వేళ సీపీ సజ్జనార్‌ తనిఖీలు.. రౌడీ షీటర్ల ఇళ్లలో, షాపుల ఓనర్లకు వార్నింగ్

Hyderabad News: అర్ధరాత్రి వేళ సీపీ సజ్జనార్‌ తనిఖీలు.. రౌడీ షీటర్ల ఇళ్లలో, షాపుల ఓనర్లకు వార్నింగ్
Advertisement

Hyderabad News:  హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ వీసీ స‌జ్జనార్ అర్ధరాత్రి పెట్రోలింగ్ నిర్వహించారు. సౌత్‌వెస్ట్ జోన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. దాదాపు మూడు గంటలపాటు ఆయా తనిఖీలు చేపట్టారు. ఉన్నట్లుండి స్వయంగా సీపీ అర్థరాత్రి రావడంతో ఒక్కసారిగా స్టాప్ ఉలిక్కిపడింది.  మిడ్ నైట్ చెకింగ్ వెనుక అసలేం జరిగింది?

అర్ధరాత్రి వేళ సీపీ సజ్జనార్‌ తనిఖీలు

Advertisement

Advertisement

ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ గురించి చెప్పనక్కర్లేదు. ఏ విభాగం అప్పగించినా తేడా రానివ్వరు. గతంలో ఆర్టీసీలో పని చేసినప్పుడు అలాగే వ్యవహరించారు. ప్రస్తుతం హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉన్నట్లుండి ఆయన అర్థ‌రాత్రి పెట్రోలింగ్ నిర్వహించారు.

ఎలాంటి సైరన్, అధికారుల ఆర్బాటం లేకుండా సౌత్ వెస్ట్ జోన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. తొలుత సిబ్బంది ఏ విధంగా విధులు నిర్వహిస్తున్నారు అనేది గమనించారు. ఆ తర్వాత సిబ్బందితో కలిసి అర్థరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున గంటల వరకు వేర్వేరు ప్రాంతాలో తనిఖీలు చేపట్టారు. వాటిలో ఎండీ లైన్స్, ఆశాం నగర్, డిఫెన్స్ కాలనీల్లో చెకింగ్ చేశారు.

షాపుల ఓనర్లకు వార్నింగ్

ముఖ్యంగా రౌడీ షీటర్ల ఇళ్లకు నేరుగా వెళ్లి, వారిని నిద్రలేపి వారి గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత జీవనశైలి, ఉపాధి పరిస్థితులు వాటిపై ఆరా తీశారు. నేరాల వైపు ఏ మాత్రం దృష్టి మళ్లినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆ తరహా నేర ప్ర‌వృత్తి ఉన్నవారు సన్మార్గంలోకి రావాల‌ని సూచన చేశారు. కీలక ప్రాంతాలు, సున్నితమైన పాయింట్లను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు.

అలాగే తెల్లవారుజామున మూడుగంటల వరకు టోలిచౌకి పరిధిలో తెరిచి ఉంటాయి. తొలుత సీపీ అటువైపు ఫోకస్ చేశారు. ఓపెన్ చేసిన హోటళ్లు, షాపులు, వ్యాపార సంస్థల్లోకి వెళ్లి పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా షాపులు తెరిచి ఉంచితే చర్యలు తీసుకుంటామని వ్యాపారులను హెచ్చరించారు.

ALSO READ: రంగారెడ్డి జిల్లాలో నకిలీ సర్టిఫికెట్ల అమ్మకాలు, 50 వేలకు పదో తరగతి సర్టిఫికెట్లు

దీనికితోడు పెట్రోలింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారా లేరా అనేది గమనించారు. రాత్రి వేళల్లో ప్రజల భద్రత కోసం ఎలాంటి చర్యలు చేపడుతున్నారనే దానిపై పరిశీలించి, ఆరా తీశారు. డ్యూటీలో ఉన్న కానిస్టేబుళ్లు, అధికారులతో మాట్లాడారు. అలాగే గస్తీ పాయింట్లు వంటివాటి గురించి వివరాలు తెలుసుకున్నారు. టోలిచౌకి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి డ్యూటీలో ఉన్న సిబ్బంది హాజరు వివరాలు సమగ్రంగా పరిశీలించారు.

రాత్రి వేళల్లో పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించినట్టు సీపీ సజ్జనార్ తెలిపారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది ఎలా వ్యవహరిస్తున్నారు? అనే విషయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు పర్యటనలు చేస్తున్నట్లు వెల్లడించారు. సేవల నాణ్యతను మెరుగుపరుస్తాయని, విజిబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. నగర భద్రత కోసం పోలీసులు నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు.

 

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×