Hyderabad Crime: కన్నతండ్రి పాలిట కన్న కొడుకే కాల యముడయ్యాడు. కత్తితో ఏకంగా 15 సార్లు పొడిచి తండ్రిని హత్య చేశాడు కుమారుడు. ఈ ఘటన హైదరాబాద్ లోని కుషాయిగూడలో శనివారం మధ్యాహ్నం జరిగింది. హైదరాబాద్ లాలాగూడ ఇందిరానగర్ కు చెందిన ఆరేల్లి మొగిలి కి సాయికుమార్ అనే కుమారుడు ఉన్నాడు. సాయికుమార్ రోజూ మద్యం సేవించి కుటుంబ సభ్యులను వేధించేవాడు. ఈ క్రమంలో తరచూ ఇంట్లో ఘర్షణ వాతావరణం ఉండేది. సాయికుమార్ ఆగడాలను అరికట్టాలని తండ్రి మొగిలి పలుమార్లు ప్రయత్నించారు. కానీ సాయికుమార్ లో ఎటువంటి మార్పు రాలేదు. ఈ క్రమంలో మద్యానికి బానిసైన కుమార్.. తండ్రిపై కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది.
అయితే శనివారం మధ్యాహ్నం తండ్రి, కొడుకు మధ్య ఎలా వివాదం చెలరేగిందో కానీ, ఏకంగా కత్తి పట్టుకొని సాయికుమార్ తన తండ్రి వెంటపడ్డాడు. కుషాయిగూడ వద్ద తండ్రి మొగిలి వెంటపడ్డ కుమార్ స్థానికులు చూస్తుండగానే కత్తితో దాడి చేశాడు. కుమారుడు కత్తితో దాడి చేస్తున్న క్రమంలో తప్పించుకునేందుకు పరుగులు పెట్టిన మొగిలి.. ఈసీఐఎల్ బస్ స్టాప్ వద్దకు చేరుకున్నాడు. అక్కడే మొగిలి పరుగులు పెట్టలేక ఆగిపోవడంతో సాయికుమార్ కత్తితో ఏకంగా 15 సార్లు పొడిచినట్లు స్థానికులు తెలుపుతున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందింది. వెంటనే మొగిలిని శ్రీకర వైద్యశాలకు తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.
పోలీసులు కేసు నమోదు చేసి మొగిలి మృతదేహాన్ని గాంధీ వైద్యశాలకు తరలించారు. అలాగే తండ్రిని హత్య చేసిన కొడుకు సాయికుమార్ ను కుషాయిగూడ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. కన్న కొడుకు కాల యముడుగా మారి కన్నతండ్రిని కత్తితో 15 సార్లు పొడిచిన ఘటన హైదరాబాద్ నగరంలో సంచలనంగా మారింది. అందుకే తమ పిల్లలపై ప్రేమతో పాటు తల్లిదండ్రుల నియంత్రణ కూడా ఉండాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
Also Read: సారీ చెప్పిన లోకల్ బాయ్ నాని.. డోంట్ రిపీట్ అంటూ సజ్జనార్ మళ్లీ వార్నింగ్
బాల్యం నుండే చెడు అలవాట్ల కలిగే అనర్ధాలను పిల్లలకు వివరించాలని, అలాగే కథల రూపంలో తల్లిదండ్రుల ప్రాముఖ్యత తెలిసేలా వివరించాల్సిన అవసరం ఉందని మేధావులు అంటున్నారు. యుక్త వయస్సు వచ్చాక మార్పు రావాలంటే రాదని, నేటి యువతపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పటికైనా పిల్లల అలవాట్లపై ఓ కన్ను వేసి, వారిలో మార్పు తెచ్చేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కుషాయిగూడ మర్డర్ అప్డేట్స్..
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరెల్లి మొగిలి మృతి
నడ్డిరోడ్డుపై కన్న తండ్రిని కత్తితో పొడిచి చంపిన కొడుకు సాయికుమార్
మొగిలి శరీరంపై 15 కత్తి పోట్లు
రోజూ మద్యం సేవించి కుటుంబ సభ్యులను వేధిస్తున్నందుకే తండ్రిని హత్య చేసినట్లు చెబుతున్న సాయికుమార్… https://t.co/0m5VXX7sn9 pic.twitter.com/l0VcgUrk2n
— BIG TV Breaking News (@bigtvtelugu) February 22, 2025