Viral news: అప్పుడప్పును మనం కొన్ని అద్భుతాలను చూస్తుంటాం. కొన్ని అబద్దాలను కొందరు నిజం అనేలా నమ్మించేలా చక్కగా తీర్చి దిద్దుతారు. కొందరు ఆకాశంలోని చుక్కలను ఇంట్లోనే ఏర్పాటు చేసుకుని ఆ అనుభూతిని పొందుతారు. ఇలా మనం ఎన్నో అద్భుతాలను కళ్ల ముందు చూస్తుంటాం.
తాజాగా, ఓ వ్యక్తి తన ఇంటి కాంపౌండ్ వాల్ ను ట్రైన్ ఇంజిన్, కంపార్ట్ మెంట్ లతో సహా నిజమైన ప్యాసింజర్ రైలును పోలి ఉండి.. చూపరులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు. దీనిపై పలువురు పలు విధాలుగా కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ గా మారింది. నెటిజన్లు కొందరు వావ్.. అద్భుతం అని కామెంట్ చేస్తుండగా.. మరి కొందరు అయితే అసలు ‘మేం నిజమైన ట్రైనే అనుకున్నాం’ అని కామెంట్ చేస్తున్నారు.
ALSO READ: TG Govt Jobs: తెలంగాణ కొలువుల జాతర.. త్వరలో 14,236 ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఈ ప్యాసింజర్ ట్రైన్ మాదిరిగా ఉన్న కాంపౌండ్ వాల్ ను కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ లో ఓ వ్యక్తి నిర్మించికున్నారు. అయితే, ప్యాసింజర్ ట్రైన్ తన రైల్వే ట్రాక్ ను విడిచి ఓ వ్యక్తి ఇంటి ముందు ఉండడం ఎలా సాధ్యం అని మీరు ఆలోచిస్తున్నారా..? ఓ ఇంజిన్, ఏసీ కోచ్, స్లీపర్ క్లాస్ తో కూడిన ట్రైన్ ను పోలి ఉంది. అయితే ఇది చూడడానికి సరిగ్గా నిజమైన ట్రైన్ గా ఉంది. అది కూడా ప్యాసింజర్ ట్రైన్ ను పోలి ఉంది. కేరళ లోని కోజికోడ్ లో ఇండియన్ రైలును పోలిన ఈ కాంపౌండ్ వాల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందర్నీ ఆకర్షిస్తుంది. వాల్ కంపార్టె మెంట్, ట్రైన్ చక్రాలు, చక్కగా డిజైన్ లతో తీర్చి దిద్దడంతో వీడియో వైరల్ అవుతోంది.
ALSO READ: Jobs in Indian Railways: శుభవార్త.. రైల్వేలో 32,438 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోనివారికి మరో అవకాశం..
ఇది మరే ఇతర ఇంటిలాంటి మామూలు కాంపౌండ్ వాల్ కాదని, రైల్వే పట్ల తనకున్న ప్రేమకు ఇది ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇండియన్ రైల్వేలో ఉద్యోగం చేసిన ఓ వ్యక్తి ఇటీవల రిటైర్ అయినట్లు తెలుస్తోంది. రైల్వే పట్ల ఆయనకు అభిమానంతో ఇలా ఇంటి గోడను నిర్మించుకున్నట్లు తెలుస్తోంది. ఈట్రైన్ కు 22597 Palangad Express అని పేరు కూడా పెట్టుకున్నారు. అయితే ఇది అచ్చం ప్యాసింజర్ ట్రైన్ ను పోలి ఉన్న ఇంటి కాంపౌండ్ ను పోలి ఉండడంతో అటు వైపు వెళుతున్న ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. కొందరు అయితే, కాంపౌండ్ వాల్ తో కూడిన ట్రైన్ ను చూడడానికే అటు పక్కన వెళ్తున్నారు. కుంజిప్ప ఆరంబ్రమ్ అనే వినియోగదారు ఇన్‌స్టాగ్రామ్‌లో మొదట షేర్ చేసిన ఈ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తుంది.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">