Hyderabad Crime: హైదరాబాద్ మహానగరంలో.. మరో ఘోరం జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన స్నేహితుడు.. జూనియర్ డాక్టర్ కలల్ని చిదిమేశాడు. ఈ దారుణం మియాపూర్‌లో వెలుగు చూసింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి శాంతినగర్‌కు చెందిన భూమయ్యకు ముగ్గురు కూతుళ్లు. చదువుల్లో చురుగ్గా ఉండే రెండో కుమార్తె డాక్టర్ కె. సృజన.. మహబూబ్‌నగర్‌లో ఎంబీబీఎస్ పూర్తిచేసింది. ప్రస్తుతం హనుమకొండలో పీజీ పీడియాట్రిషన్ తొలి సంవత్సరం చదువుతోంది.
సెల్‌ఫోన్ ఆధారంగా గుర్తింపు..
అక్కడే.. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్నారు. కాగా, ఏడేళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రవికుమార్ అనే యువకుడు ఆమెకు పరిచయమయ్యాడు. ఈ క్రమంలో అతనితో స్నేహం ఏర్పడింది. అయితే, కొద్దిరోజుల క్రితం రవికుమార్ ఆమె దగ్గర బంగారు గొలుసు తీసుకున్నాడు. దానిని తిరిగిస్తానని.. సృజనని హైదరాబాద్‌కు రమ్మన్నాడు. దీంతో గత నెల 30న ఆ అమ్మాయి హైదరాబాద్‌కు వచ్చింది. రోజులు గడుస్తున్నా.. హనుమకొండకు రాలేదు. ఫ్రెండ్స్ ఎన్నిసార్లు కాల్ చేసినా.. రెస్పాన్స్ లేదు. దాంతో.. వారు ఆమె తండ్రికి సమాచారం ఇవ్వడంతో.. హనుమకొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా సృజన మియాపూర్ హఫీజ్‌పేటలో ఉన్నట్లు గుర్తించారు.
పథకం ప్రకారమే హత్య చేశాడా..?
పోలీసులు హఫీజ్‌పేటకు వెళ్లి ఆరా తీయగా.. ఊహించని దృశ్యం కనిపించింది. గత నెల 29న రవికుమార్ ఓ హోటల్‌లో గదిని అద్దెకు తీసుకున్నట్లు నిర్వాహకులు చెప్పారు. ఆ గది తాళాలు తీసి చూడగా.. సృజన మృతదేహం కనిపించింది. దిండుతో ఊపిరాడకుండా చేసి హతమార్చి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడి ఫోన్ స్విచ్చాఫ్ కావటంతో.. పథకం ప్రకారమే ఆమెను గదికి రప్పించి హత్య చేసినట్లు అంచనాకు వచ్చారు. అమ్మాయి తండ్రి ఫిర్యాదుతో మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజీ ద్వారా నిందితుడి ఆనవాళ్లు సేకరిస్తున్నారు.
Also Read: ప్రియురాలి పీక కోసి.. బిల్డింగ్‌పై నుంచి దూకేసిన ప్రియుడు