E-Paper
Advertisement

కాకినాడ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్.. చాట్‌జీపీటీ సాయంతో ప్లాన్.. అసలు సూత్రధారి అతడే!

కాకినాడ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్.. చాట్‌జీపీటీ సాయంతో ప్లాన్.. అసలు సూత్రధారి అతడే!
Advertisement

Kakinada: కాకినాడకు చెందిన ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య, ఏఈ అల్లుడు జగదీశ్వరరెడ్డి హత్య కేసు.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో.. నిందితుడు సాధిక్‌ఖాన్‌ను కస్టడీకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఎంక్వైరీలో.. మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు చెప్పాడు సాదిక్. సౌజన్య భర్త జగదీశ్వరరెడ్డిపై విష ప్రయోగానికి ముందు.. చాట్‌ జీపీటీలో సాదిక్ సెర్చ్ చేసినట్లు తెలిసింది. ముందుగా.. ఓ కెమికల్‌ని.. కొబ్బరి నీళ్లలో కలిపి ఇవ్వగా జగదీశ్వరరెడ్డి ఆరోగ్యం క్షీణించింది. తర్వాతి ప్రయత్నంలో సైనేడ్‌ను ప్రొటీన్‌ పౌడర్‌లో కలిపి ఇవ్వడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు.

చాట్‌జీపీటీ సాయంతో ప్లాన్..

Advertisement

ఈ కెమికల్స్ ప్రభావం ఎంత, ఎంత పరిమాణంలో వినియోగించాలి? వాటిని ఎందులో మిక్స్ చేసి ఇవ్వాలనే విషయాలన్నీ.. చాట్‌ జీపీటీ ద్వారా తెలుసుకున్నట్లు సమాచారం. కస్టడీలో విచారణలో భాగంగా.. నిందితుడు సాదిక్‌కు పోలీసులు 70కి పైగా ప్రశ్నలు వేశారు. 60 వేలు వెచ్చించి.. ఆ విషపదార్థాలను తానే తెప్పించానని, వాటిని జగదీశ్వరరెడ్డిపై ప్రయోగించింది మాత్రం.. భార్య సౌజన్యేనని చెప్పినట్లు తెలిసింది.

గోదావరిలో దూకి ఆత్మహత్య..

Advertisement

ఏడాదిన్నర కాలంగా సౌజన్యతో సాదిక్ సన్నిహితంగా మెలుగుతున్నాడు. అప్పటికే ఆమెకు భర్తతో ఉన్న గొడవలను అనుకూలంగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. భర్తపై విష ప్రయోగం జరిపేలా ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. జగదీశ్వరరెడ్డి చనిపోయిన రెండు నెలలకు.. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. తాను ఈ ఏడాది చివరిలో ఉద్యోగ విరమణ చేస్తానని, అప్పటి వరకు పెళ్లి వద్దని.. సౌజన్య తండ్రి నూకరాజు చెప్పారని తెలిపాడు. అంతవరకు వేచి చూస్తే వారి మనసు మారిపోయే అవకాశం ఉందని భావించి.. సాదిక్ నూకరాజు కుటుంబంపై పెళ్లి కోసం ఒత్తిడి తెచ్చాడు. ఆగస్టు 14న వారి ఇంటికి వెళ్లి గొడవపడ్డాడు. జగదీశ్వరరెడ్డి హత్య వెనుక ఎవరున్నది బయటపెడతానని బెదిరించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో.. నూకరాజు కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

Also Read: 7 ఏళ్ల ఇన్‌స్టా పరిచయం.. పక్కా స్కెచ్‌తో హత్య.. డాక్టర్ సృజన కేసులో షాకింగ్ వివరాలు

Tags

Related News

ప్రియురాలి పీక కోసి.. బిల్డింగ్‌పై నుంచి దూకేసిన ప్రియుడు

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం.. మంత్రి నారాయణ కీలక ప్రకటన

శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. పరిశ్రమ బాయిల‌ర్‌లో భారీ పేలుడు.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి!

విశాఖ బీచ్‌లో విషాదం.. ముగ్గురు విద్యార్థులు గల్లంతు, నైట్ విజన్ కెమెరాలతో గాలింపు..

ఏపీలో సంచలనం.. తిరుపతి బీజేపీ నేత హత్యకు భార్య కుట్ర.. బయటపడ్డ షాకింగ్ నిజాలు!

ఆంధ్రా బిడ్డగా నన్ను భావించండి.. ఏం చెయ్యాలో చెప్పండి, తెలుగులో మాట్లాడిన అనంత్ అంబానీ

అన్నయ్యా బాబాయ్ కేసు.. ఈడీ పిలిచారు, ఇప్పుడు ఏం చేద్దాం, వైసీపీలో నేతల ఉక్కిరి బిక్కిరి

Big Stories

Advertisement
×