E-Paper
Advertisement

అల్లు అర్జున్ పై వేణు స్వామి కామెంట్స్.. అక్కడికి వెళ్తే బన్నీతోనే అంటూ?

అల్లు అర్జున్ పై వేణు స్వామి కామెంట్స్.. అక్కడికి వెళ్తే బన్నీతోనే అంటూ?
Advertisement

Venu Swamy -Allu Arjun: వేణు స్వామి పరిచయం అవసరం లేని పేరు ప్రముఖ ఆస్ట్రాలర్ గా కొనసాగుతున్న వేణు స్వామి(Venu Swamy) నిత్యం ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తుంటారు. గత కొద్ది రోజుల క్రితం వేణు స్వామి తరచూ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీల గురించి వారి జాతకాలు సినిమా విశేషాలు గురించి సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఉండేవారు ఈ నేపథ్యంలోనే వేణు స్వామి తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఎదుర్కొన్నారు. ఏకంగా తనపై కేసులు పెట్టడం వరకు కూడా వెళ్ళింది.

చంద్రయాన్ ఫస్ట్ సింగిల్ లాంచ్..

ఇలా వేణు స్వామికి వ్యతిరేకత రావడంతో ఈయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారి గురించి తాను ఇకపై ఎప్పుడు మాట్లాడనని తెలిపారు. అప్పటినుంచి వేణు స్వామి ఎక్కడ సెలబ్రిటీల ప్రస్తావన తీసుకురావడం లేదు అయితే తాజాగా ఈయన చంద్రయాన్(Chandrayan) సినిమా పస్ట్ సింగిల్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వంలో డైరెక్టర్ వేణు ఉడుగుల సమర్పణలో ప్రవీణ్ మొలక నిర్మాణంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చంద్రయాన్ అనగానే అందరికీ సైన్స్ ఫిక్షన్ సినిమా గుర్తుకు వస్తుంది కానీ ఈ సినిమా మాత్రం తెలంగాణ నేపథ్యంలో ఒక కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ముఖ్యఅతిథిగా వేణు స్వామి..

Advertisement

శివ కుమార్ దికొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్ వంటి తదితరులు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి పస్ట్ సింగిల్ లాంచ్ ఈవెంట్ నేడు ప్రసాద్ ల్యాబ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆస్ట్రాలజర్ వేణు స్వామి హాజరయ్యారు. ఇక ఈ సినిమా చంద్రయాన్ పేరుతో రాబోతున్న నేపథ్యంలో వేణు స్వామిని ఉద్దేశించి యాంకర్ మాట్లాడుతూ మీకు కనుక రాకెట్ లో చంద్రయాన్ పైకి వెళ్లే అవకాశం వస్తే మీతో పాటు ఏ టాలీవుడ్ హీరోని వెంట తీసుకెళ్తారు అంటూ ప్రశ్న వేశారు.

అల్లు అర్జున్ ను వెంట తీసుకెళ్తా..

ఈ ప్రశ్నకు వేణు స్వామి టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే అల్లు అర్జున్ (Allu Arjun)అని సమాధానం ఇచ్చారు . ఇలా రాకెట్ లో చంద్రయాన్ పైకి వెళ్తే కచ్చితంగా తనతో పాటు నటుడు అల్లు అర్జున్ వెంట తీసుకువెళ్తానని ఈయన చెప్పడంతో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బన్నీ ఫాన్స్ వేణు స్వామికి అల్లు అర్జున్ అంటే ఇష్టమా అందుకే ఇలాంటి కామెంట్స్ చేశారా అంటూ ఈ వ్యాఖ్యలపై స్పందిస్తున్నారు. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే ఈయన ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో రాకా సినిమా(Raaka Movie) పనులలో బిజీగా ఉన్నారు ఈ సినిమా దాదాపు 70% షూటింగ్ పనులను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Also Read:రాంప్రసాద్ నువ్వేమైనా పిస్తావా?డిజాస్టర్ కెప్టెన్ .. విశ్వరూపం చూపించిన నాగార్జున!
 

Related News

ఎస్కేఎన్ చేతుల మీదుగా ‘ధరణి ఐ లవ్ యు’ పోస్టర్ లాంఛ్!

నంది ఫిల్మ్ అవార్డుల పునరుద్ధరణ.. హర్షం వ్యక్తం చేసిన ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ !

వందల కోట్లు పోగొట్టుకున్న హీరో నవదీప్?

నేను సన్నీ లియోన్ లాంటి వాడిని..అన్నీ విప్పేసా ..వేణు స్వామి వైరల్ కామెంట్స్ !

హీరోయిన్ బుగ్గలు గిల్లిన అభిమాని.. ఆమె రియాక్షన్?

రష్మిక పిలిచినప్పుడు పలకకపోతే అలా అంటుందా? మొత్తం బయటపెట్టిన విజయ్!

‘చుట్టమల్లే’ ఏఐ వివాదంపై జాన్వీ కపూర్ రియాక్షన్.. శిక్ష తప్పదంటూ హెచ్చరిక!

Big Stories

Advertisement
×