BigTV English

418 Stones in Kidney: నాలుగు రాళ్లు వెనకేసుకోమంటే.. మనోడు ఏకంగా కిడ్నీలో 400కి పైగా వెనకేసుకున్నాడట!

418 Stones in Kidney: నాలుగు రాళ్లు వెనకేసుకోమంటే.. మనోడు ఏకంగా కిడ్నీలో 400కి పైగా వెనకేసుకున్నాడట!

hyadarabad


Hyderabad Doctors Remove 418 Kidney Stones from 60 Year Old Man: 60 ఏళ్ల వృద్ధుడి కిడ్నీ నుంచి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 418 రాళ్లు తొలగించారు. హైదరాబాద్ లోని ఏషియన్ హాస్పిటల్ ఇన్ స్టిట్యూట్ ఆప్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్ యూ) వైద్యులు చేసిన ఓ ఆపరేషన్ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అరవై ఏళ్ల వృద్ధుడికి స్టోన్స్ తొలగించి శస్త్ర చికిత్స నిర్వహించి రాళ్లను బయటకు తీసారు.

వివరాల్లోకి వెళ్తే.. 60 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి కిడ్నీ దెబ్బతినడంతో ఏఐఎన్ యూ ఆస్పత్తికి చేరారు. వివిద పరీక్షల అనంతరం అతని కిడ్నీలో పెద్ద సంఖ్యలో రాళ్లు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. దీంతో అతనికి చికిత్స నిర్వహించి రాళ్లను తొలగించాలని డాక్టర్లు నిర్ధారించారు. సాధారణంగా వైద్యులు లాపరోస్కోపిక్ శస్త్రచికిత్స ద్వారా మూత్రపిండాలలో రాళ్లను తొలగిస్తుంటారు. కానీ దీనికి బదులుగా ఇక్కడ డాక్టర్లు పెర్క్యుటేనియస్ నెఫ్రోలిథోటోమి (PCNL) అనే సాంకేతికతను ఉపయోగించి ఎలాంటి ఆపరేషన్ లేకుండా రోగికి మూత్రపిండంలో చిన్న రంద్రం చేసి సూక్ష్మ కెమెరా, లేజర్ ప్రోబ్స్ తో కిడ్నీలో రాళ్లను తొలగించారు.


ఇలా చేయడం వల్లన రోగికి పెద్దగా బాధ కాని, నొప్పి కాని ఉండదు. మొత్తానికి కేవలం 27 % మాత్రమే పని చేస్తున్న ఆ వ్యక్తి నుంచి సమారు 418 రాళ్లు బయటకు తీసినట్లు డాక్టర్లు చెప్పారు. అనంతరం అతడి కిడ్నీ పనితీరు మెరుగు పడటంతో డిశ్చార్జ్ చేశామని అక్కడి డాక్టర్ల బృందం తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియ దాదాపు రెండు గంటల సమయం పట్టిందని వివరించారు.

Also Read: భూదాన్‌ భూముల అక్రమాలపై టీఎస్ సర్కార్ కొరడా.. మైహోమ్, కీర్తి సిమెంట్స్ కు నోటీసులు

కిడ్నీ ఆరోగ్యం కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోమని డాక్టర్లు చెబుతున్నారు. ఆహారంలో ఉప్పు తక్కువగా తీసుకోమనడంతో పాటు , వీలైనంత ఎక్కువగా తీసుకోమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి డాక్టర్లు విజయవంతంగా ఆపరేషన్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఆపరేషన్లు ఆశాజనంకంగా ఉంటాయి అంటున్నారు నెటిజన్లు.

Tags

Related News

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Big Stories

×