Hyderabad Formula E Race Case: ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి శుక్రవారం తెలంగాణ హైకోర్టులో విచారణ సాగింది. మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ సాగింది. గత విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ ని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో, ఏసీబీ శుక్రవారం కౌంటర్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా జరిగిన విచారణలో కేటీఆర్ ను అరెస్టు చేయకుండా జారీ చేసిన ఉత్తర్వులను ఈనెల 31 వరకు హైకోర్టు పొడిగించింది. తదుపరి విచారణను 31వ తేదీకి వాయిదా వేయగా, కేటీఆర్ ను అరెస్టు చేయకుండా జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఏసీబీ హైకోర్టును విచారణ సందర్భంగా కోరింది.
ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కౌంటర్ దాఖలు చేసిన ఏసీబీ
"కేటీఆర్ నాట్ టు అరెస్ట్" ను ఎత్తివేయాలని పిటిషన్ వేసిన ఏసీబీ
ఏసీబీ వేసిన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం
తదుపరి విచారణ ఈనెల 31కి వాయిదా https://t.co/8UKYxRz6KP
— BIG TV Breaking News (@bigtvtelugu) December 27, 2024