Vivek oberai:ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్(Vivek oberai)విభిన్నమైన పాత్రలు పోషించి, భారీ పాపులారిటీ అందుకున్నారు. ముఖ్యంగా వివాదాస్పద దర్శకుడిగా పేరుపొందిన రాంగోపాల్ వర్మ(Ram Gopal Varma) దర్శకత్వంలో వచ్చిన ‘రక్త చరిత్ర’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇక అలా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైన వివేక్.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని, తన ఆవేదనను వ్యక్తం చేశారు. ముఖ్యంగా తన తొలి ప్రేమ కథను వివరించి అందరిని ఆశ్చర్యపరిచారు. 13 ఏళ్ల వయసులోనే తాను ప్రేమలో పడ్డానని, ఆమెతోనే తన జీవితాన్ని ఊహించుకున్నానని, కానీ చివరికి తన ప్రేమ కథ విషాదాంతం అయింది అని తెలిపారు.
ఆమె మరణంతో సర్వం కోల్పోయినట్టు అనిపించింది..
వివేక్ ఒబెరాయ్ మాట్లాడుతూ.. “నాకు 13 సంవత్సరాల వయసున్నప్పుడే తొలిసారి ప్రేమలో పడ్డాను. ఆమె నా స్వీట్ హార్ట్.. నాకంటే ఏడాది చిన్నది కూడా.. అయితే నాకు 18 ఏళ్ల వయసున్నప్పుడు ఆమెతో నా ప్రేమాయణం మొదలైంది. ఆమె నా జీవిత భాగస్వామి అనుకున్నాను. అంతేకాదు చదువు పూర్తి చేసి, ఉద్యోగం సంపాదించిన తర్వాత, ఆమెను పెళ్లి చేసుకొని, పిల్లలను కనాలని, పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలని, ఇలా ఎన్నో కలలు కన్నాను. అయితే అలా ఒకసారి తనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పింది. నేను జ్వరం లేదా జలుబు లాంటివి వచ్చి ఉంటాయి. విశ్రాంతి తీసుకొని మళ్ళీ వచ్చేస్తుందిలే అనుకున్నాను. అంతే ఆమె రాలేదు. ఆమె కోసం నెలలు ఎదురు చూశాను. కానీ ఆమె జాడ తెలియలేదు. దాంతో వెంటనే ఫోన్ చేసిన రెస్పాండ్ కాకపోవడంతో ఆమె బంధువుల అమ్మాయికి ఫోన్ చేశాను. అప్పుడు ఆమె తాను ఆసుపత్రిలో ఉందని చెప్పింది. వెంటనే నేను అక్కడికి పరుగులు తీశాను. ఇక ఆమెకు క్యాన్సర్ అని, చివరి స్టేజ్ లో ఉందని తెలిసి ఆశ్చర్యపోయాను. హాస్పిటల్లో బెడ్ పై ఆమెను చూసి నేను తట్టుకోలేక పోయాను. రెండు నెలల్లోనే ఆమె మరణించింది. ఆమె మరణం నన్ను కలిచి వేసింది. ఎవరిని చూసినా నాకు ఆమె కనిపించేది. ఆమె మరణంతో సర్వం కోల్పోయినట్టు అనిపించింది. ఆ బాధ నుంచి బయటపడడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. ఇక ఆ తర్వాతే క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారులకు నా వంతు సహాయం చేయాలనే ఆలోచన మొదలైంది. ఇక అప్పటినుంచి నా వంతు సహాయం నేను చేస్తున్నాను” అంటూ తన జీవితంలో ఎదురైన కష్టం గురించి వివరించి అందరిని ఆశ్చర్యపరిచారు వివేక్.
బలవంతపు పెళ్లి..
ప్రేమలో కొన్ని ఎదురుదెబ్బలు తగిలిన తర్వాత పెళ్లి పై నిర్ణయం మారిందని, ఇక పెళ్లి కూడా చేసుకోకూడదని నిర్ణయించుకున్నారట వివేక్. కానీ కుటుంబ సభ్యుల బలవంతం మేరకు ప్రియాంకను కలిశారట. అలా 2010లో ఆమెను వివాహం చేసుకున్నాను అని కూడా తెలిపారు. ఇక అలా ప్రేమించిన అమ్మాయి దూరమయ్యేసరికి ఎంతో వేదన అనుభవించిన వివేక్ బలవంతంగానే పెళ్లి చేసుకున్నారు. మరి ఈ వైవాహిక బంధం గురించి ఆయన నోరు విప్పలేదు.