BigTV English

Israel – Lebanon Ceasefire : బాంబుల మోత.. తుపాకుల రోతకు విరామం.. ఆ దేశాల నిర్ణయానికి ఇండియా ఫిదా

Israel – Lebanon Ceasefire : బాంబుల మోత.. తుపాకుల రోతకు విరామం.. ఆ దేశాల నిర్ణయానికి ఇండియా ఫిదా

Israel – Lebanon Ceasefire : యుద్ధ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పశ్చిమాసియాలో శాంతి వీచికలు వీచాయి. చాన్నాళ్లుగా యుద్ధంలో తలపడుతున్న ఇజ్రాయిల్ – హెజ్ బొల్లా
ఉగ్రవాద సంస్థల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ ప్రాంతంలోని ఉద్రిక్తత పరిస్థితులను చక్కదిద్దటంలో ఇది కీలక పరిణామంగా అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా ఇజ్రాయిల్ – లెబనాన్ మధ్య అమెరికా, ఫ్రాన్స్ మధ్యవర్తిత్వం వహించాయి.


గత ఏడాది గాజా ప్రాంతంలోని ఉగ్రవాద శిబిరాలపై ఇజ్రాయిల్ దళాలు దాడులు చేయడంతో ఇజ్రాయిల్ – హెజ్ బొల్లా మధ్య వార్ మొదలైంది. క్రమంగా తీవ్రంగా మారిన యుద్ధంలో అనేక వేల మంది మరణించగా, లెక్కకు మించి క్షతగాత్రులుగా మిగిలిపోయారు. ఇజ్రాయిల్ సరిహద్దులకు చాలా దగ్గరగా ఉన్న లెబనాన్ నుంచి తీవ్రస్థాయిలో యుద్ధానికి అన్ని ఏర్పాట్లు చేసుకోగా, వాటన్నింటిపై ఇజ్రాయిల్ దళాలు క్షిపణుల వర్షం కురిపించి.. వాటిని నాశనం చేశాయి. కాగా.. ఈ ఇరువురి మధ్య కాల్పుల విరమణకు అనేక ప్రయత్నాలు జరిగాయి. కాగా.. ఇప్పుడు అమెరికా, ఫ్రాన్స్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణకు ఇరుపక్షాలు అంగీకారం తెలపాయి. హెజ్ బొల్లాపై కాల్పుల విరమణకు ఇజ్రాయిల్ సెక్యూరిటీ క్యాబినెట్ అంగీకారం తెలిపిన వెంటనే ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఒప్పందం తర్వాత ఇజ్రాయిల్ ప్రధాని బెంజమెన్ నెతన్యాహు, లెబనాన్ తాత్కాలిక ప్రధాని నజీబ్ మికటితో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఫోన్ లో సంభాషించారు.

కాల్పుల విరమణ ఒప్పందాన్ని పక్క ప్రణాళికతో రూపొందించినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఇజ్రాయిల్ భద్రతకు హెజ్ బొల్లా సహా, లెబనాన్ లోని మరో ఉగ్రవాద సంస్థలు కానీ, మరే ఇతర అనుబంధ సంస్థలు కానీ ప్రయత్నించకూడదనే షరతు విధించారు. అలాగే.. గాజాలో ఇజ్రాయిల్ దళాలు స్వాధీనం చేసుకున్న ప్రాంతాన్ని వదిలి వెళ్లాలనే హెజ్ బొల్లా డిమాండ్ కు చోటు కల్పించారు. క్రమంగా 60 రోజుల వ్యవధిలో 60 రోజుల వ్యవధిలో ఇజ్రాయిల్ దళాలు తిరిగి వెనక్కి వెళ్లిపోయేందుకు ఇజ్రాయిల్ అంగీకారం తెలిపింది. ఆ ప్రాంతాన్ని లెబనాన్ ఆర్మీ స్వాధీనంలోకి తీసుకోనుంది. ఇందుకు గాను ఇప్పటికే.. 5,000 మంది సైనికులు సిద్ధంగా ఉన్నట్టు ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్దుల్ బౌ హబీబ్ వెల్లడించారు.


కాల్పుల విమరణ ఒప్పందం తర్వాత ఆ ప్రాంతాల్లో తిరిగి ఇజ్రాయిల్ కు వ్యతిరేకంగా ఎలాంటి ఉగ్రవాద అనుకూల నిర్మాణాలు, మౌలిక వసతులు నిర్మించడానికి వీల్లేదని ఆమెరికా స్పష్టం చేసింది. ఒకవేళ అలా చేస్తే.. పరిస్థితులు తిరిగి యధాతథ స్థితికి వస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే.. గాజా సరిహద్దుల్లో ఇరుపక్షాల కాల్పులు, బాంబు దాడుల కారణంగా ఈ ప్రాంతాలను వదిలి వెళ్ళిన పౌరులు త్వరలోనే తిరిగి ఆ ప్రాంతాలకు సురక్షితంగా చేరుకోవచ్చని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు.

కాల్పుల విరమణ మీ చేతుల్లోనే

ఇజ్రాయిల్ – లెబనాన్ మధ్య కుదిరిన ఒప్పందం అమలు బాధ్యతలు లెబనాన్ చేతిలోనే ఉంటాయంటూ ఇజ్రాయిల్ ప్రధాని బెంజమెన్ నేతన్యాహు వ్యాఖ్యానించారు. ఒప్పందం తర్వాత ఎలాంటి ఉగ్రవాద చర్యలకు పాల్పడినా, అలాంటి ప్రయత్నాలు చేసినా తాము గట్టిగా ప్రతిస్పందిస్తామని, ఈ సారి వారిని పూర్తిగా తుడిచిపెట్టేసిన తర్వాతనే వదిలిపెడతామంటూ హెచ్చరికలు చేశారు.

భారత స్పందన

ఇరాన్ మద్ధతుతో దాడులకు పాల్పడుతున్న హెజ్ బొల్లా – ఇజ్రాయిల్ దళాల మధ్య కాల్పుల విమరణ ఒప్పందం కుదరడంపై భారత విదేశాంఖ శాఖ హర్షం వ్యక్తం చేసింది. ఇరు దేశాల చర్యలను స్వాగతిస్తున్నామని, భారత్ ఎల్లప్పుడూ శాంతి, సామరస్యాలకు మద్ధతిస్తుందని ప్రకటించింది. ఎలాంటి వివాదాలనైనా చర్చలు, దౌత్య మార్గాల్లో పరిష్కరించుకునేందుకు మద్ధతిస్తామని ప్రకటించింది. తాజా పరిణామాలతో ఈ ప్రాంతంలో మళ్లీ శాంతి, సుస్తిరత, స్థిరత్వం వస్తాయని భావిస్తున్నట్లు విదేశాంగ శాఖ మంత్రి అధికార ప్రతినిధి రణ్ ధీర్ జైస్వాల్ ప్రకటించారు. ప్రపంచ దేశాలు అనేకం ఈ ఒప్పందాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటనలు విడుదల చేశాయి. ఇజ్రాయిల్ – లెబనాన్ అధికారుల మధ్య చాలా కాలంగా యూఎస్ అధికారుల సంప్రదింపుల కారణంగానే ఈ ఒప్పందం సాకారమయ్యిందని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ సంతోషం వ్యక్తం చేశారు.

Also Read :  సన్యాసం కోసం.. రూ.వేల కోట్ల సామ్రాజ్యాన్ని వదిలేసిన బిలీనియర్

ఒప్పందం వెనక కారణాలు
కాల్పుల విరమణకు అంగీకరించడంపై నెతన్యాహు పై కొంత ఒత్తిడి ఉన్నట్లు వివిధ కథనాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా అక్కడి ప్రతిపక్షం.. లెబనాన్ తో ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కానీ.. ఈ ఒప్పందం ద్వారా హెజ్ బొల్లాపై పోరుకు విరామం ప్రకటించడంతో పాటు ఇరాన్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టేందుకు అవకాశం లభిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అలానే ఏళ్లుగా సాగుతున్న యుద్ధంతో నిండుకున్న ఇజ్రాయిల్ ఆయుధ నిల్వలను తిరిగి నింపుకునేందుకు, అవిశ్రాంతంగా పోరాడుతున్న సైన్యానికి విశ్రాంతి ఇచ్చేందుకు ఈ చర్య ఒప్పందం సహాయపడుతుందని విశ్లేషిస్తున్నారు.

Related News

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Donald Trump: ట్రంప్ టారీఫ్ బాంబ్.. ఏ రంగాలపై ఎఫెక్ట్..?

Big Stories

×