Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోకు సంబంధించి ఓ వార్త వెలుగులోకి వచ్చింది. దాని సారాంశం ఏంటంటే.. రోజువారీ, నెల వారీ పాస్‌లపై ఎల్ అండ్ టీ విముఖత చూపినట్టు కీలకమైన పాయింట్. ఆ అంశంపై గురువారం జరగనున్న బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులు డిమాండ్ చేస్తున్న రోజు, నెలవారీ పాస్‌లకు మోక్షం లభించే అవకాశాలు కనిపించలేదు. మెట్రో నెట్‌వర్క్‌లో పాస్‌ల విధానం సాధ్యం కాదని హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ ఎల్‌అండ్‌టీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ప్రతిరోజూ మెట్రోలో ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర రెగ్యులర్ ప్రయాణికుల్లో నిరాశలో ఉన్నారు. మెట్రో ప్రారంభమైనప్పటి నుంచి రోజువారీ, నెలవారీ పాస్‌లు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు ప్రయాణికులు. ప్రతిరోజూ ఒకే మార్గంలో ప్రయాణించే ఉద్యోగులు-విద్యార్థులకు పాస్‌లు ఉంటే ప్రయాణ ఖర్చు తగ్గడంతోపాటు టికెట్ తీసుకునే ప్రక్రియ సులభమవుతుందని భావించారు.
ఈ విషయాన్ని మెట్రో అధికారులు పలుమార్లు ఎల్‌అండ్‌టీ-హైదరాబాద్ మెట్రోరైలు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటివరకు సానుకూల స్పందన వచ్చిన సందర్భంలేదు. ఈనెల చివర్లో జరగనున్న హైదరాబాద్ మెట్రోరైలు లిమిటెడ్ బోర్డు సమావేశంలో పాస్‌ల అంశం మరోసారి తెరపైకి రానుంది. మెట్రోలో రోజు-నెలవారీ పాస్‌లు ప్రవేశపెట్టే మార్గాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు హెచ్‌ఎంఆర్‌ఎల్ చైర్మన్ సంజయ్ జాజు. దీనిపై అధికారులు.. ఎల్‌అండ్‌టీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రతినిధులతో చర్చించినట్లు తెలుస్తోంది. దీనికి ఆ సంస్థ విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.
గతంలో ఇదే వైఖరిని అనుసరించిన సంస్థ, తన అభిప్రాయాన్ని మార్చుకోలేదని అంటున్నారు అధికారులు. పాస్‌ల అంశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై హెచ్‌ఎంఆర్‌ఎల్ బోర్డు సమావేశంలో చర్చించనున్నారు. బోర్డు తీసుకునే నిర్ణయం ఆధారంగా తదుపరి కార్యాచరణ మొదలుకానుంది. దీనిపై ఎల్‌అండ్‌టీతో చర్చించాలా? ప్రత్యామ్నాయ విధానాన్ని పరిశీలించాలా? వాటిపై ఇవాళ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మెట్రోరైలు-ఆర్టీసీ మధ్య ఉమ్మడి టికెట్-పాస్‌ల అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
ALSO READ: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్.. ధిక్కరణ నోటీసులు జారీ!
మెట్రో-ఆర్టీసీ సేవలను ఒకే టికెట్ వ్యవస్థతో అనుసంధానిస్తే.. ప్రజా రవాణా మరింత సులభమవుతుందని భావిస్తున్నారు అధికారులు. 45 రోజుల్లోగా మెట్రో మొదటి దశకు సంబంధించిన రుణ సమీకరణను పూర్తి చేయడం మరియు రెండవ దశకు సంబంధించిన ఆమోదాల పురోగతికి సంబంధించి నేటి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. దీనికితోడు 45 రోజుల్లో మెట్రో మొదటి దశకు సంబంధించిన రుణ సమీకరణను పూర్తి చేయడం, రెండో దశకు సంబంధించి ఆమోదాల పురోగతి గురించి నేటి సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నారు.