E-Paper
Advertisement

నగరవాసులకు గుడ్ న్యూస్.. భారీగా మెట్రో విస్తరణ.. సీఎం రేవంత్ కీలక ప్రకటన!

నగరవాసులకు గుడ్ న్యూస్.. భారీగా మెట్రో విస్తరణ.. సీఎం రేవంత్ కీలక ప్రకటన!
Advertisement

Metro Expansion: స్వేచ్ఛ బ్యూరో: ప్రజా ప్రయోజనాల దృష్ట్యా హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ కు మెట్రో నెట్ వర్క్ విస్తరించాలనే వివిధ వర్గాల డిమాండ్ మేరకు మెట్రో విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. విస్తరణకు ఉన్న అడ్డంకులను, ఎదురవుతున్న ఇబ్బందులను లోతుగా సమీక్షించి ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు.

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతమున్న మెట్రో ఫేజ్ 1 మొత్తం 69 కిలోమీటర్లు ఉన్నదని, ఫేజ్ 2(ఏ) 76.4 కిలోమీటర్లు, ఫేజ్ 2 (బీ) 86.1 కిలోమీటర్ల ఉన్నదన్నారు. ఈ మేరకు ఫేజ్ 2 విస్తరణ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి ప్రభుత్వం సమర్పించిందన్నారు. హైదరాబాద్ మెట్రో విస్తరణకు ప్రస్తుతం ఉన్న ప్రత్యేక పరిస్థితిని అందరూ అర్థం చేసుకోవాలన్నారు. ఫేజ్-I ప్రైవేట్ నిర్వహణలో ఉండగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో ఫేజ్-II ప్రభుత్వ ప్రాజెక్టుగా చేపట్టేందుకు ఎదురవుతున్న సాంకేతిక, చట్టపరమైన, నిర్వహణ సమస్యలను ప్రభుత్వం అధ్యయనం చేస్తుందన్నారు.

Advertisement

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిన ఆంశాలను పరిష్కరించేందుకు ఎల్ అండ్ టీ సంస్థ నుండి మెట్రో ఫేజ్ 1 నెట్‌వర్క్ ను రాష్ట్ర ప్రభుత్వం హెచ్ ఎమ్ ఆర్ ఎల్ ద్వారా స్వాధీనం చేసుకుంటున్నామన్నారు. ఇందుకు సభ కూడా ఆమోదం తెలిపిందన్నారు. మెట్రో ఫేజ్ 1 స్వాధీనం చేసుకునే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను స్వాగతించిన సభకు ధన్యవాదాలు తెలిపారు. ఫేజ్ 2 విస్తరణకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం త్వరగా పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున గట్టి కృషి చేస్తున్నట్లు సీఎం వివరించారు.

బోయినపల్లి మార్కెట్ కాదు.. నరక ద్వారం.. ఈటల రాజేందర్ సంచలన కామెంట్స్!

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×