BigTV English

Hyderabad Metro : డిసెంబర్ 9 నుంచి పనులు స్టార్ట్.. రూ. 6250 కోట్ల ప్రాజెక్ట్

Hyderabad Metro : డిసెంబర్ 9 నుంచి పనులు స్టార్ట్.. రూ. 6250 కోట్ల ప్రాజెక్ట్

Hyderabad Metro : రోజు రోజుకు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో ప్రజారవాణా వ్యవస్థ పటిష్టత అత్యవసరం. నిత్యం ట్రాఫిక్ జామ్ లతో ఇబ్బంది పడుతున్న నగరవాసులు.. చాన్నాళ్లుగా మెట్రో విస్తరణ డిమాండ్ చేస్తున్నారు. వారికి శుభవార్త. హైదరాబాద్ లో మెట్రో రైలు విస్తరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. మెట్రో సెకండ్ ఫేజ్ పనులకు సీఎం కేసీఆర్ డిసెంబర్ 9న శంకుస్థాపన చేయనున్నారు.


కోవిడ్ తో ప్రపంచంలో అనూహ్య మార్పులు వచ్చాయి. చాలా వ్యవస్థలు స్తంభించి పోయాయి. కానీ.. భాగ్యనగరం హైదరాబాద్ లో మాత్రం కోవిడ్ తరువాత ఊహించిన దానికంటే ఎక్కువగా ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఇక్కడి వాతావరణం జనజీవనం త్వరగా సాధారణ స్థితికి వచ్చేలా దోహదపడింది. పూర్తి స్థాయిలో కార్యాలయాలు పనిచేస్తున్నాయి. కాగా.. కోవిడ్ దెబ్బకు వ్యక్తిగత వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో.. రవాణా ప్రధానంగా మారింది.

మరోవైపు కాలుష్యం కూడా పెరుగుతున్నది. దేశరాజధాని ఢిల్లీలో కాలుష్య పరిస్థితులు భయపెడుతున్న నేపథ్యంలో ప్రజారవాణా, కాలుష్య రహిత ప్రయాణాన్ని జనాలు కోరుకుంటున్నారు. అందుకే తమ ప్రాంతాలకు కూడా మెట్రోను విస్తరించాలని అనేక సార్లు ప్రభుత్వాన్ని కోరారు. మెట్రో ఫేజ్ -2ను వెంటనే పట్టాలెక్కించాలని డిమాండ్ చేసారు. ఐతే.. ముందస్తు ఎన్నికలకు టీఆరెస్ సన్నాహాలు చేసుకుంటున్నదని ప్రచారం జరుగుతున్న వేళ.. హైదరాబాదీలకు శుభవార్తను చెప్పింది రాష్ట్ర సర్కారు. మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ వరకు మెట్రో పొడిగిస్తూ.. రెండో విడత పనులను త్వరలో ప్రారంభించబోతున్నారు. మెట్రో సెకండ్ ఫేజ్ పనులకు సీఎం కేసీఆర్ డిసెంబర్ 9న శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటన చేశారు.


మెట్రో సెకండ్ ఫేజ్ పనులను రూ. 6,250 కోట్లతో చేపట్టనున్నారు. మొత్తం 31 కిలోమీటర్ల మేర మెట్రో సేవలను విస్తరించనున్నారు. మెట్రో రెండో విడత పనులు పూర్తై అందుబాటులోకి వస్తే శంషాబాద్ ఎయిర్‌ పోర్ట్‌ వెళ్లే ప్రయాణికులకు ప్రయాణ సమయం మరింత తగ్గనుంది.

మెట్రో సెకండ్ ఫేస్‌ విషయంలో నవంబర్ 14న మంత్రి మంత్రి కేటీఆర్‌.. కేంద్రానికి లేఖ రాశారు. ఫేజ్ -1 లో 69 కిలోమీటర్ల మేర నడుస్తున్న మెట్రోకు అదనంగా మరో 31 కిలోమీటర్లకు విస్తరించాలనుకుంటున్న తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలకు ఆర్థికంగా చేయూత ఇవ్వాలని తన లేఖలో కోరారు. బీహెచ్ఈఎల్-లక్డీకాపుల్, నాగోల్ –ఎల్బీనగర్ కారిడార్ నిర్మాణానికి రూ.8453 కోట్ల వ్యయం అయిందన్నారు. దీని నిర్మాణాన్ని భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వ ఉమ్మడి భాగస్వామ్యంలో నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ ప్రభుత్వం పంపిన రూ.8453 కోట్ల రూపాయల ప్రాజెక్టు ప్రతిపాదనలకు సూత్రప్రాయ అంగీకారం ఇచ్చి వచ్చే బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించాలని కోరారు. ఈ ప్రాజెక్టులకు ఆర్థిక సాయాన్ని కోరేందుకు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీని స్వయంగా కలిసి వివరించేందుకు సమయం కూడా అడిగినట్టు కేటీఆర్ గతంలోనే తెలిపారు. ఈ విషయంలో మరింత ఆలస్యం కాకుండా తెలంగాణ ప్రభుత్వం తరుపున మెట్రో విస్తరణకు సంబంధించిన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కేంద్రానికి పంపినట్టు తన లేఖలో తెలిపారు.

Tags

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×