BigTV English

Hyderabad Metro: హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. మెట్రో వేళలు పొడిగింపు..

Hyderabad Metro: హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. మెట్రో వేళలు పొడిగింపు..

Hyderabad Metro: హైదరాబాదీలకు మెట్రో యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. 45 రోజుల పాటు మెట్రో పనివేళలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. నాంపల్లి గ్రౌండ్స్ లో 83వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ఫిబ్రవరి 15వ తేదీ వరకూ ఈ ఎగ్జిబిషన్ ను నిర్వహిస్తారు. ఈ ఎగ్జిబిషన్ ను చూసేందుకు నగరం నలుమూలల నుంచి సందర్శకులు వస్తారు. సందర్శకుల తాకిడి నేపథ్యంలో.. మెట్రో పనివేళలను పెంచింది.


సందర్శకుల కోసం మెట్రో రైళ్ల వేళలను అర్థరాత్రి వరకూ పొడిగిస్తున్నట్లు మెట్రో యాజమాన్యం తెలిపింది. మియాపూర్ – ఎల్బీ నగర్, నాగోల్ – రాయదుర్గం మార్గాల్లో మెట్రో రైలు చివరి ట్రిప్ రాత్రి 12.15 గంటలకు ప్రారంభమై అర్థరాత్రి 1 గంటకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. అలాగే నుమాయిష్ కు వెళ్లే ప్రయాణికుల కోసం మెట్రోస్టేషన్లలో స్పెషల్ టికెట్ కౌంటర్ ను కూడా ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు టీఎస్ ఆర్టీసీ కూడా నుమాయిష్ కోసం ప్రత్యేక బస్సుల్ని నడపనుంది. ఈ ఎగ్జిబిషన్ కు సుమారు 22 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు.

నుమాయిష్ ఎగ్జిబిషన్ ఎంట్రీ టికెట్ ధర రూ.40గా నిర్ణయించారు. వారాంతాల్లో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ.. మిగతా రోజుల్లో సాయంత్రం 4 గంటల నుంచి 10.30 గంటల వరకు ఎంట్రీ ఉంటుంది. అలాగే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ వాహనాలతో లోపలికి వెళ్లొచ్చు. అయితే ఇందుకోసం ప్రత్యేకంగా రూ.600 చెల్లించాల్సి ఉంటుంది.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×