BigTV English

Hyderabad Metro: సాంకేతిక లోపంతో ఎక్కడికక్కడ నిలిచిపోయిన మెట్రో రైళ్లు.. ప్రయాణికులు అవస్థలు

Hyderabad Metro: సాంకేతిక లోపంతో ఎక్కడికక్కడ నిలిచిపోయిన మెట్రో రైళ్లు.. ప్రయాణికులు అవస్థలు

Hyderabad Metro: ఎప్పుడూ రద్దీగా తిరిగే హైదరాబాద్ మెట్రో రైళ్లకు సాంకేతిక లోపం కారణంగా ఎక్కడికక్కడే మెట్రో రైళ్లు ఆగిపోయాయి. నాగోల్-రాయదుర్గం, LB నగర్-మియాపూర్ మార్గంలో అరగంట నుంచి ఎక్కడి ట్రెయిన్స్ అక్కడ ఆగిపోయాయి. బేగంపేట మెట్రో స్టేషన్ లో దాదాపు 15 నిమిషాల పాటు మెట్రో రైళ్లను ఆపేశారు. దీనికి కారణం సాంకేతిక లోపం అని అధికారులు తెలిపారు. అయితే ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మెట్రో రైళ్లకు అంతరాయం ఏర్పడలేదు. 10 గంటల నుంచే సాంకేతిక లోపం కారణంగా ఎక్కడికక్కడే పలు రైళ్లు నిలిచిపోయాయని మెట్రో యాజమాన్యం తెలిపింది.


ఆఫీసులకు వెళ్లే సమయం కావడం.. రైళ్లు ఎంతకీ కదలకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. టెక్నికల్ ఇష్యూ వల్లన ఆగిపోయిన మెట్రో రైళ్లు.. త్వరలోనే యథావిధిగా తిరుగుతాయని మెట్రో అధికారులు వివరించారు. అయితే సాంకేతిక లోపానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మెట్రో ఆగిపోవడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. చాలా సార్లు ఇలాంటి సమస్యలు తలెత్తాయి. అయిన అధికారులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని మెట్రో స్టేషన్‌లో ప్రయాణికులు రద్దీ భారీగా పెరిగింది. ఇక అమీర పేట్ మెట్రో స్టేషన్‌లో అయితే చెప్పనవసరం లేదు. ఇసుకేస్తే రాలనంతగా ప్రయాణికు ఫ్లాట్ ఫామ్‌లపై నిరీక్షిస్తున్నారు.

Also Read: ప్ర‌భుత్వాసుపత్రుల‌పై సర్కార్ ఫోక‌స్..మందుల కొర‌తకు చెక్!


ఇదెలా ఉంటే..హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు రేవంత్ ప్రభుత్వం భవిష్యత్ కార్యక్రమాలు చేపట్టబోతోంది. ఇందుకోసం కార్యాచరణ రెడీ అవుతోంది. నెక్ట్ లెవెల్ డెవలప్ మెంట్ ఏంటో చూపించబోతోంది. ఇందుకోసం జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్ ల సమీక్షా సమావేశంలో ప్రభుత్వం కీలక సూచనలు ఇచ్చింది. మరోవైపు హైదరాబాద్ నగర వాసులు ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న మెట్రో సెకండ్ ఫేజ్ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది. త్వరలోనే దీనికి సంబంధించిన పనులు ప్రారంభం కానున్నాయి.

 

Related News

Hyderabad News: జీహెచ్ఎంసీ నిఘా.. ఆ పని చేస్తే బుక్కయినట్టే, అసలు మేటరేంటి?

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Big Stories

×