Hyderabad News: ఫ్రీ వస్తే ఫినాయిల్ తాగేస్తారేమో అన్న సామెత.. పైన కనిపిస్తున్న యువకుడికి అతికినట్టు సరిపోతుంది. మంచి నీళ్లు ఫ్రీగా వస్తాయని భావించాడు. వృధాగా పోవడం ఎందుకని గమనించారు. తన బుర్రకు పదును పెట్టాడు. వాటర్ సర్వీసింగ్ ఇస్తే డబ్బులు ఖర్చు అవుతాయని భావించాడు. ఏకంగా మంచినీటితో బైక్ కడిగాడు. బండి పుష్పంగా మెరిచింది. కాకపోతే ఆ వ్యక్తి వెయ్యి రూపాయలు జరిమానా కట్టాల్సి వచ్చింది. ఈ ఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో జరిగింది.
విచ్చల విడిగా నీటి వినియోగం
అసలే ఎండాకాలం.. రోజురోజుకూ భానుడు తీవ్ర ప్రతాపం చూపుతున్నాడు. కొత్త ఏర్పడిన జీహెచ్ఎంసీ పరిధిలో కొన్ని చోట్ల తాగేందుకు నీళ్లు దొరక్క ప్రజలు అక్కడక్కడ ఇబ్బంది పడుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. అయితే నాకేంటి? అన్నట్లుగా వ్యవహరించాడు ఆ యువకుడు. ఫ్రీ గా వస్తున్నాయని తాగే మంచినీటితో బైక్‌ని కడిగేశాడు. అటువైపు మీదుగా వెళ్లున్నవాళ్లు ఆ బైక్ చూసి సూపర్బ్ అంటూ చమత్క రించారు. సరిగ్గా వాటర్ బోర్డు ఎండీ దృష్టిలో పడ్డాడు.
బుక్కైన యువకుడు
జలమండలి సరఫరా చేసే తాగు నీటిని ఇతర అవసరాలకు వినియోగించిన అధికారులు ఓ వ్యక్తికి రూ. 1000 జరిమానా విధించారు. ఈ ఘటన జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 78లో జరిగింది. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ ప్రధాన రహదారిపై వెళ్తున్నారు. అయితే జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 78లో రోడ్డుపై నీరు ప్రవహిస్తోంది. పైపు లీక్ అవుతుందేమోనని గమనించిన ఆ ఎండీ, వాటర్ లీకేజికి కారణాలు ఆరా తీయాలని దిగువస్థాయి సిబ్బందికి ఆదేశించారు.
ఫ్రీగా వస్తుందని భావించాడు.. వెయ్యి కట్టాడు
డివిజన్ జీఎం హరిశంకర్ స్థానిక మేనేజర్‌తో కలిసి జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 78కి వెళ్లి పరిశీలించారు. దగ్గరికి వెళ్లి చూసి షాకయ్యారు అధికారులు. జలమండలి సరఫరా చేసే మంచినీటితో ఓ యువకుడు చక్కగా బైక్ కడుగుతున్నాడు. ఇదే విషయాన్ని ఎండీ అశోక్‌రెడ్డికి వివరించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎండీ, ఆ యువకుడికి నోటీసు ఇచ్చి రూ. 1000 జరిమానా వేయాలని సంబంధిత మేనేజర్‌ను ఆదేశించారు. ఆ వ్యక్తికి రూ.1000 జరిమానా విధించారు అధికారులు.
ALSO READ: సమయం ఆసన్నమైంది.. మీనాక్షితో పరిస్థితి మారుతుందా ?
గ్రేటర్ వ్యాప్తంగా
జలమండలి సరఫరా చేసే తాగునీరు ఇలా ఇతర అవసరాలకు వినియోగించద్ధని ఎండీ విజ్ఞప్తి చేశారు. ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జలమండలి జీహెచ్ఎంసీ ఓఆర్ఆర్ పరిధిలో ప్రతీరోజూ 550 ఎంజీడీల తాగునీటిని ప్రజలకు సరఫరా చేస్తోంది. దాదాపు 13.7 లక్షల నీటి కనెక్షన్లు ఉన్నాయి. వెయ్యి లీటర్ల నీటి సరఫరాకు రూ.48 వ్యయం చేస్తోంది.
కేవలం తాగునీటి కోసం ఉద్దేశించిన రక్షిత నీటిని కొందరు వేరే అవసరాలకు వినియోగించుకుంటున్నారు. వాహనాలను శుభ్రం చేయడానికి, గార్డెనింగ్, ఇళ్ల పరిసరాలను కడగడానికి వృధా చేస్తే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని ఎండీ అశోక్‌రెడ్డి హెచ్చరించారు. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి జలమండలి సుదూర ప్రాంతాల నుంచి నీటిని శుద్ధి చేసి ప్రజలకు సరఫరా చేస్తుంది.
నీటిని వృథా చేయకుండా తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కోరుతోంది. ఇప్పటికే నగరంలో భూగర్భ జలాలు అడుగంటాయి. కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. రానున్న రెండు నెలలు నీటికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్నాయి. వీటిని తాగునీటి సరఫరా చేసే శుద్ధమైన నీటిని వృధా చేయకూడని విజ్ఞప్తి చేస్తోంది హైదరాబాద్ వాటర్ బోర్డు.
తాగునీటితో బైక్ క్లీనింగ్… వ్యక్తికి జరిమానా
====================
# ఎవరైనా ఇలా చేస్తే చర్యలు తీసుకుంటామని ఎండీ హెచ్చరికజలమండలి సరఫరా చేసే తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించిన వ్యక్తికి అధికారులు జరిమానా విధించారు. ఈ ఘటన జూబ్లీహిల్స్ లో జరిగింది.
జలమండలి ఎండీ అశోక్ రెడ్డి… pic.twitter.com/VVOjD66UIB
— HMWSSB (@HMWSSBOnline) March 5, 2025