Film industry:ప్రముఖ కన్నడ నటి రన్యారావ్ (Ranyarao) గత రెండు మూడు రోజులుగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈమె తాజాగా ఒక కొత్త వివాదంలో చిక్కుకున్నారు.. దుబాయ్ నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ ఉండగా.. బెంగళూరు విమానాశ్రయంలో ఆమెను అరెస్టు చేసి, ఆమె నుంచి సుమారుగా 14.8 కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం ఈ విషయం తెలిసి అటు శాండిల్ వుడ్ లోనే కాకుండా సినీ పరిశ్రమ మొత్తం ఉలిక్కిపడింది. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ కేస్ ఇప్పుడు కర్ణాటక మొత్తం సంచలనం సృష్టిస్తోందని చెప్పవచ్చు. ముఖ్యంగా బెంగళూరులో ఆమె ఇంటి నుంచి కోట్ల రూపాయల తో పాటు భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
కూతురు అరెస్ట్ పై డీజీపీ రియాక్షన్..
అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన మరో విషయం ఏమిటంటే రన్యారావ్ కర్ణాటక డీజీపీ రామచంద్ర రావు(Ramachandra Rao) కూతురు కావడం గమనార్హం. అయితే డీజీపీ రామచంద్రరావు ఆమె సొంత తండ్రి కాదు.. సవతి తండ్రి.. ఈ విషయం మీడియా ద్వారా ఆయన దృష్టికి రావడంతో ఆయన ఈ విషయం తనకు తెలియదని తెలిపారు. నీకు అందులో భాగంగానే.. దుబాయ్ నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ డీఆర్‌ఐ అరెస్ట్ చేసిన తన కూతురు రన్యారావుపై కర్ణాటక రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డీజీపీ రామచంద్రరావు మాట్లాడుతూ..” ఇలాంటి ఘటన మీడియా ద్వారా నా దృష్టికి రావడంతో నేనూ షాక్‌కి గురయ్యాను. నా కెరీర్‌లో ఎలాంటి బ్లాక్ మార్క్ లేదు. వెంటనే తగిన చర్యలు తీసుకోండి. గత నాలుగు నెలల క్రితమే రన్యా పెళ్లి చేసుకుంది. భర్తతో కలిసి ఇంకో కాపురం పెట్టింది. గత కొన్ని రోజులుగా ఆమె మాతో మాట్లాడడం లేదు. కాబట్టి ఆమె చేసే ఏ వ్యవహారం కూడా మా దృష్టికి రాలేదు. ముఖ్యంగా ఈ వ్యవహారంతో నాకు ఎటువంటి సంబంధం లేదు” అంటూ రామచంద్రరావు వెల్లడించారు.
రన్యా రావు నుండి స్వాధీనం చేసుకున్న నగదు వివరాలు..
రన్యారావ్ ను అదుపులోకి తీసుకున్న డీఆర్ఐ అధికారులు.. 2కోట్లకు పైగా విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ.2కోట్ల 67 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి తోడు మంగళవారం రోజు 15 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడడంతో ఆమె నుండి సుమారుగా రూ.12.50 కోట్ల రూపాయల బంగారాన్ని సొంతం చేసుకున్నట్లు సమాచారం.
రిమాండ్ విధించిన బెంగళూరు కోర్ట్..
విదేశాల నుండి ఢిల్లీ మీదుగా అక్రమంగా గోల్డ్ స్మగ్లింగ్ బెంగళూరుకి చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది బెంగళూరు కోర్టు. ఈ మధ్య తరచూ దుబాయ్ వెళ్లి వస్తుండడంతో ఆమె మీద కన్నేసిన అధికారులు 15 రోజుల వ్యవధిలోనే ఆమె నాలుగు సార్లు దుబాయ్ వెళ్లడాన్ని గమనించారు. ఎలాంటి అనుమానం రాకుండా గోల్డ్ బిస్కెట్లను బట్టల్లో దాచి తీసుకొస్తున్నట్లు గుర్తించారు. చివరికి సోమవారం రోజున రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇకపోతే ఎయిర్పోర్ట్ లో దిగిన ప్రతిసారి తాను డీజీపీ కూతురు అని చెప్పుకొని చెకింగ్ ల నుంచి తప్పించుకునేదట .ఇక ప్రతిసారి పోలీస్ సెక్యూరిటీతోనే ఆమె బెంగళూరు ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటికి వెళ్లేది. ఈ నేపథ్యంలోనే వారంలో నాలుగు సార్లు దుబాయ్ వెళ్లొచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఇక తరచూ దుబాయ్ కి వెళ్లి వస్తున్న నేపథ్యంలో అనుమానం వచ్చిన అధికారులు దాడుల నిర్వహించి ఈమెను అదుపులోకి తీసుకున్నారు.
రన్యా రావు సినిమా జీవితం..
35 ఏళ్ల రన్యారావ్ కిచ్చా సుదీప్ (Kiccha Sudeep) హీరోగా నటించిన ‘మాణిక్య’ అనే చిత్రం ద్వారా అరంగేట్రం చేశారు. పటాకీ, వాఘా వంటి చిత్రాలలో నటించింది.