BigTV English

MP Asaduddin house vandalised in Delhi: ఢిల్లీలో ఎంపీ అసదుద్దీన్ ఇంటిపై రాళ్ల దాడి, ఎవరి పని?

MP Asaduddin house vandalised in Delhi: ఢిల్లీలో ఎంపీ అసదుద్దీన్ ఇంటిపై రాళ్ల దాడి, ఎవరి పని?

MP Asaduddin house vandalised in Delhi: ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై దాడి జరిగింది. గుర్తు తెలియని కొందరు ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ దాడిలో ఇంటి కిటికీలు పగిలిపోయాయి. దుండగులు దాడి చేసిన రాళ్లు ఇంటి ఆవరణంలో పడి వున్నాయి.


ఢిల్లీలో గురువారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. రాళ్ల దాడి సమయంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇంట్లో లేరు. రాజస్థాన్ పర్యటనలో ఉన్నారు. ఈ విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా తెలిపారు. ఈ ట్వీట్‌ను ఢిల్లీ పోలీసులు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాలకు ట్యాగ్ చేశారు.

ఈ క్రమంలో X లో ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఎంపీల భద్రతకు గ్యారెంటీ ఉందో లేదో చెప్పాలని స్పీకర్‌ను కోరారు. తన ఇంటిపై దాడి చేసిన వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆ తరహా దాడులు భయపెట్టలేవని, సావర్కర్ తరహా ప్రవర్తనను ఆపాలని సూటిగా హెచ్చరించారు.


ఘటనపై ఆయన ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ అదనపు డీసీపీ నేతృత్వంలోని పోలీసుల టీమ్ ఆయన నివాసానికి వెళ్లింది. ఇంటి నేమ్ బోర్డుపై ఉన్న సిరా మరకలను చెరిపివేశారు. అక్కడే ఉన్న సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించారు పోలీసులు. ఎంపీ అసదుద్దీన్ ఇంటిపై దాడి జరగడం ఇది తొలిసారి కాదు. గతంలో దాడి జరిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.

రెండురోజుల కిందట పార్లమెంటులో ఎంపీగా అసదుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమయంలో ఆయన జై పాలస్తీనా అంటూ స్లోగన్ ఇచ్చారు. ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. దీనిపై పలువురు బీజేపీ ఎంపీలు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.

ALSO READ: మెదక్‌లో ఘోరమైర యాక్సిడెంట్‌లో నలుగురు మృతి

ఈ ఏడాది చివరలో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అక్కడ ఎంపీ అసదుద్దీన్ పర్యటిస్తున్నారు. ఇంతలోనే ఢిల్లీలో ఎంపీ అసదుద్దీన్ నివాసంపై రాళ్ల దాడి జరగడం తీవ్ర కలకలం రేపింది. 2014 నుంచి ఇప్పటివరకు నాలుగు సార్లు ఈ ఎంపీ ఇంటిపై దాడి జరిగింది.

 

 

Tags

Related News

SC Stay On Elections: గిరిజన వర్సెస్ గిరిజనేతర.. ఆ 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీం స్టే

Rain: మళ్లీ అతిభారీ వర్షాలు వచ్చేస్తున్నయ్ భయ్యా.. కమ్ముకొస్తున్న పిడుగుల వాన, అలర్ట్‌గా ఉండండి..!

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Medaram Maha Jatara: మేడారం మహాజాతర డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల

Sammakka-Saralamma: వనదేవతలు సమ్మక్క- సారలమ్మలు అన్ని గమనిస్తున్నారు.. కేంద్రంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్

Heavy Rains: మరో అల్పపీడనం.. నాలుగు రోజులు వర్షాలు దంచుడే దంచుడు..

Hyderabad News: పండగ సమీపిస్తున్న వేళ.. జోరుగా నాన్ డ్యూటీ లిక్కర్, అధికారులు ఉక్కుపాదం

Big Stories

×