BigTV English

Asaduddin Owaisi Jai Palestine Chants: పార్లమెంట్‌లో ఎంపీగా ప్రమాణ స్వీకారం.. జై పాలస్తీన నినాదాలతో దుమారం రేపిన అసదుద్దీన్!

Asaduddin Owaisi Jai Palestine Chants: పార్లమెంట్‌లో ఎంపీగా ప్రమాణ స్వీకారం.. జై పాలస్తీన నినాదాలతో దుమారం రేపిన అసదుద్దీన్!

Asaduddin Owaisi says Jai Palestine during Oath as MP In Parliament: పార్లమెంట్‌లో ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ మరోసారి వార్తల్లో నిలిచారు. 18వ లోక్ సభలో భాగంగా తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారం సందర్భంగా హైదరాబాద్ ఎంపీ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీన అనే నినాదాలు చేశారు. దీంతో బీజేపీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్డీయేలో భాగమైన పార్టీలు కూడా అభ్యంతరం తెలిపారు.


అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. అధికార పక్ష ఎంపీలు చేసిన విన్నపాలను పరిగణలోకి తీసుకున్న లోక్ సభ ప్రోటెం స్పీకర్ మెహతాబ్.. అసదుద్దీన్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తనని పేర్కొన్నారు. దీంతో తీవ్ర దుమారం రేపిన అసదుద్దీన్ వివాదం సద్దుమణిగింది.

Also Read: Dengue Alert In Bengaluru: బెంగళూరులో డెంగ్యూ డేంజర్ బెల్స్.. 3 వారాల్లో 1000 కేసులు నమోదు

కాగా దీనిపై అసదుద్దీన్ స్పందించారు. తానని జై పాలస్తీన అనకుండా రాజ్యాంగంలో ఎలాంటి నిబంధన లేదని ఆయన పేర్కొన్నారు. తాను మాట్లాడిన దానిపై రాద్దాంతం చేస్తున్నారని ఇతర సభ్యులు కూడా తమకు నచ్చినట్టుగా నినాదాలు చేస్తున్నారని అన్నారు. వాటిపై ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. పాలస్తీన విషయంలో గాంధీ ఏం చెప్పారో ఒకసారి విమర్శకులు చదవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఓవైసీ చేసిన నినాదం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని.. తప్పు అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి తెలిపారు. ఓ వైపు రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేస్తూ.. మరోవైపు రాజ్యాంగ వ్యతిరేక నినాదాలు చేయడం ద్వారా అసదుద్దీన్ అసలు రూపం బయటపడిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇక పార్లమెంటరీ వ్వవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు అసదుద్దీన్ నినాదాలపై స్పందించారు. ప్రభుత్వంగా తాము ఏ దేశానికి మద్దతివ్వడం కానీ వ్యతిరేకించడం లేదని.. కానీ సభ సాక్షిగా ఏ దేశం పేరును ప్రస్తావిచడం సరికాదని ఆయన అన్నారు.

ఇటీవల ముగిసిన 2024 లోక్ సభ ఎన్నికల్లో హైదరాబద్ నియోజకవర్గంలో అసదుద్దీన్ ఓవైసీ సమీప బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవిలతపై 3 లక్షల 30 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.

Also Read: కుదరని ఏకాభిప్రాయం.. తొలిసారి లోక్ సభ స్పీకర్ స్థానానికి ఎన్నిక

అసదుద్దీన్ ఓవైసీ విమర్శలకు పెట్టింది పేరు. 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసే సమయంతో ఆయన జై భీమ్, అల్లా హో అక్బర్, జై హింద్ అని నినాదాలు చేశారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బీజేపీ ఎంపీలు జై శ్రీరామ్ నినాదాలతో లోక్ సభను హోరెత్తించారు.

అసదుద్దీన్ వివాదం అలా ఉండగా బీజేపీ ఎంపీ ఛత్రపాల్ సింగ్ గంగ్వార్ ప్రమాణ స్వీకారం కూడా దుమారం రేగింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీ ఎంపీగా గెలిచిన సింగ్ ప్రమాణ స్వీకారం అనంతరం జై హిందూ రాష్ట్ర, జై భారత్ అనే నినాదాలు చేశారు. దీంతో ప్రతిపక్షాలు గంగ్వార్ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపాయి.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×