E-Paper
Advertisement

హైదరాబాద్‌లో విషాదం.. 30వ అంతస్తు నుంచి పడి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

హైదరాబాద్‌లో విషాదం.. 30వ అంతస్తు నుంచి పడి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి
Advertisement

Software Employee: హైదరాబాద్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. నానక్‌రామ్‌గూడలోని ఒక ఖరీదైన అపార్ట్‌మెంట్‌లో జరిగిన దారుణ ఘటన కలకలం రేపింది. కేవలం రెండ్రోజుల క్రితమే అద్దెకు దిగిన ఒక యువ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, అనుమానాస్పద స్థితిలో భవనంపై నుంచి పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

అసలేం జరిగింది?

Advertisement

సూర్యాపేట జిల్లాకు చెందిన ఉప్పల భరత్ (29) బెంగళూరులోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో ఉన్న ప్రసిద్ధ గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్స్‌లో భరత్ ఒక ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నాడు. ఇక్కడ విశేషం ఏంటంటే, తాను అద్దెకు దిగిన రెండ్రోజుల వ్యవధిలోనే ఈ ఘోరం జరగడం గమనార్హం.

30వ అంతస్తు నుంచి పడి..

Advertisement

అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని 30వ అంతస్తు నుంచి కిందపడటంతో భరత్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ సమయంలో కింద పార్క్ చేసి ఉన్న హ్యుండాయ్ వాగన్ఆర్ కారుపై పడటంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. తీవ్ర గాయాలపాలైన భరత్‌ను గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

పోలీసుల దర్యాప్తు

ఈ ఘటనపై సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి బంధువు ఉప్పల కిషోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. భరత్ ప్రమాదవశాత్తూ పడిపోయాడా? లేక ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: కన్న కూతురిపై తండ్రి.. భర్తను చెట్టుకు కట్టేసి భార్య ఏం చేసిందంటే.. సిద్ధిపేటలో దారుణం!

Tags

Related News

కన్న కూతురిపై తండ్రి.. భర్తను చెట్టుకు కట్టేసి భార్య ఏం చేసిందంటే.. సిద్ధిపేటలో దారుణం!

పిల్లలు చూస్తుండగానే.. భార్యని ఆ పని చేసిన భర్త, రంగారెడ్డి జిల్లాలో ఘటన

మరీ ఇంత అవినీతా.. రూ.20 లక్షల లంచంతో ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్!

గద్వాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బిగ్ షాక్.. వెంచర్ రాళ్లు తొలగింపు!

రూ.413 కోట్లతో చర్లపల్లి టెర్మినల్ నిర్మించిన కేంద్రం.. కానీ ఆ చిన్న తప్పుతో అంతా జీరో..?

ఫార్ములా-ఈ రేస్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఏసీబీ కోర్టులో కేటీఆర్ డిశ్చార్జ్ పిటిషన్!

మహిళలకు కవిత బంపరాఫర్.. అధికారంలోకి వస్తే 50% రిజర్వేషన్లకు హామీ!

Big Stories

Advertisement
×