E-Paper
Advertisement

కన్న కూతురిపై తండ్రి.. భర్తను చెట్టుకు కట్టేసి భార్య ఏం చేసిందంటే.. సిద్ధిపేటలో దారుణం!

కన్న కూతురిపై తండ్రి.. భర్తను చెట్టుకు కట్టేసి భార్య ఏం చేసిందంటే.. సిద్ధిపేటలో దారుణం!
Advertisement

Siddipet Crime: అన్నం పెట్టాల్సిన వాడే కామరూపుడైతే… కన్నతల్లే కాలయముడైంది! కుమార్తెపై కన్నేసి, రాక్షసానందానికి తెగబడిన భర్తను ఓ భార్య బంధువులతో కలిసి అంతమొందించింది. సిద్దిపేట జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

భర్త నుంచి ప్రాణ రక్షణే లక్ష్యంగా..

Advertisement

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం సేవాలాల్ తండాలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. పదిహేనేళ్ల క్రితం రాజేశ్వరిని బానోతు భగవాన్ (43) రెండో వివాహం చేసుకున్నాడు. అయితే మొదటి భర్త ద్వారా రాజేశ్వరికి జన్మించిన కుమార్తెపైనే భగవాన్ కన్నేశాడు. రోజూ లైంగిక వేధింపులకు పాల్పడుతూ పడక సుఖం కోరడంతో ఆ బాలిక నరకం అనుభవించింది. ఈ అఘాయిత్యం గురించి కూతురు కన్నీటిపర్యంతమై తల్లికి చెప్పడంతో రాజేశ్వరి గుండె పగిలిపోయింది. కన్న కూతురిని కాపాడుకోవాల్సిన భర్తే కామపిశాచిగా మారడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది.

చెట్టుకు కట్టేసి.. కారం చల్లి..

Advertisement

కూతురి రోదనలు రాజేశ్వరిలో పగను రగిలించాయి. భర్తపై విపరీతమైన ఆగ్రహంతో రగిలిపోయిన ఆమె, తన బంధువులతో కలిసి పథకం వేసింది. ఇంట్లో నిద్రపోతున్న భగవాన్‌ను బలవంతంగా బయటకు లాక్కొచ్చి సమీపంలోని చెట్టుకు గట్టిగా కట్టేశారు. ఎవరికీ అనుమానం రాకుండా, అరిస్తే ఎవరూ రక్షించలేరనే ఉద్దేశంతో తొలుత కళ్లలో కారం చల్లారు. అనంతరం ఇనుప రాడ్‌తో తలపై విచక్షణారహితంగా బాదారు. తీవ్ర రక్తస్రావం కావడంతో భగవాన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

Also Read: శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

పోలీసుల ఎంట్రీ.. ఏసీపీ వెల్లడించిన నిజాలు

ఈ హత్యపై సమాచారం అందుకున్న హుస్నాబాద్ ఏసీపీ సదానందం వెంటనే ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాజేశ్వరితో పాటు ఆమెకు సహకరించిన బంధువులను అదుపులోకి తీసుకున్నారు. భార్య రాజేశ్వరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ మీడియాకు వెల్లడించారు. కూతురి మానప్రాణాలను కాపాడుకునే క్రమంలో ఆ తల్లి తీసుకున్న అతి తీవ్రమైన నిర్ణయం ఇప్పుడు ఆ ప్రాంతంలో చర్చనీయాంశమైంది.

Tags

Related News

OLXలో బైక్ కొనేందుకు వచ్చి.. టెస్ట్ రైడ్ పేరిట బైక్‌తో పరారైన దుండగుడు

కోకాపేట తర్వాత మియాపూర్ వంతు.. భూముల వేలానికి సర్కార్ రెడీ! టార్గెట్ రూ.30 వేల కోట్లు?

బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, హైదరాబాద్ లో అర్ధరాత్రి నుంచి ఒకటే వాన

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య దాడి!

వాతావరణ సవాళ్లపై.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం!

సాగర్ జలాలపై కాక రేపుతున్న రాజకీయం.. ఇక అదొక్కటే మార్గమా..?

బీఆర్ఎస్, బీజేపీ కలిసి వచ్చినా లెక్క తేలుస్తా: సీఎం రేవంత్ సవాల్!

ఆ రెండు బిల్లులతో.. బీజేపీ వేస్తున్న బిగ్ స్కెచ్ ఇదే..?

Big Stories

Advertisement
×