E-Paper
Advertisement

వందేభారత్ కు ఇక మరింత వేగం.. ఎన్ని కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్తుందంటే?

వందేభారత్ కు ఇక మరింత వేగం.. ఎన్ని కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్తుందంటే?
Advertisement

Jammu-Srinagar Vande Bharat: జమ్మూ నుంచి శ్రీనగర్‌కు ప్రయాణించే వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.  ఈ మార్గంలోని కత్రా–బనిహాల్ సెక్షన్‌లో రైళ్ల వేగాన్ని గంటకు 100 కిలోమీటర్లకు పెంచడంతో ప్రయాణ సమయం తగ్గనుంది. రైల్వే అధికారులు టైమ్‌ టేబుల్‌ ను మార్చిన తర్వాత, జమ్మూ–శ్రీనగర్ ప్రయాణంలో దాదాపు 20 నిమిషాల వరకు తగ్గే అవకాశం ఉంది.

గంటకు 100 కిలోమీటర్లకు వేగం పెంపు

ఉధంపూర్–శ్రీనగర్–బారాముల్లా రైల్ లింక్ (USBRL)లోని కత్రా–బనిహాల్ మార్గంలో గతంలో గంటకు 75 నుంచి 85 కిలోమీటర్ల వరకు స్పీడ్ లిమిట్ ఉండేది. తాజాగా ఈ సెక్షన్‌లో వేగాన్ని గంటకు 100 కిలోమీటర్లకు పెంచారు. దీంతో రైళ్లను మరింత వేగంగా నడిపేందుకు అవకాశం ఏర్పడింది. అయితే, వేగ పరిమితి పెరిగిన వెంటనే ప్రయాణ సమయం తగ్గదు. నార్తర్న్ రైల్వే అధికారులు కొత్త టైమ్‌టేబుల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాతే ప్రయాణికులకు ఈ ఆదా లభించనుంది.

USBRL ప్రాజెక్ట్ ప్రత్యేకతలు

Advertisement

కాశ్మీర్ లోయను దేశంలోని ఇతర ప్రాంతాలతో రైల్వే మార్గం ద్వారా అనుసంధానించేందుకు USBRL ప్రాజెక్టును చేపట్టారు.  సుమారు రూ.43,780 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో మొత్తం 272 కిలోమీటర్ల రైల్వే మార్గం ఉంది. ఇందులో 36 టన్నెల్స్, 943 బ్రిడ్జిలు నిర్మించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన చీనాబ్ రైల్వే వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జిగా గుర్తింపు పొందింది. అంజి ఖాడ్ వంతెన దేశంలో తొలి కేబుల్ స్టేడ్ రైల్వే బ్రిడ్జిగా ప్రత్యేకత పొందింది.

జమ్మూ వరకు వందే భారత్ సర్వీసు

2025 జూన్ 6న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ USBRL ప్రాజెక్టును ప్రారంభించగా, 2026 మే 2న వందే భారత్ సర్వీసును కత్రా నుంచి జమ్మూ తావి వరకు పొడిగించారు. దీంతో జమ్మూ–శ్రీనగర్ మధ్య సుమారు 266 కిలోమీటర్ల దూరానికి నేరుగా రైలు సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ మార్గంలో రెండు జతల వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఉదయం, మధ్యాహ్నం వేళల్లో సర్వీసులు అందిస్తున్నారు.

భవిష్యత్తులో మరిన్ని రైళ్లు!

Advertisement

ప్రస్తుతం ఈ మార్గం సింగిల్ ట్రాక్‌తో కొనసాగుతోంది. భవిష్యత్తులో అదనపు ట్రాక్‌లు ఏర్పాటు చేసేందుకు వీలుగా రైల్వే ప్రణాళికలు రూపొందించింది. లైన్ డబ్లింగ్ జరిగితే రైళ్ల సంఖ్య పెంచడంతో పాటు రైల్వే రవాణా సామర్థ్యాన్ని మెరుగుపరచవచ్చు. ప్రస్తుతం వేగాన్ని పెంచడంతో ప్రయాణ సమయం తగ్గే అవకాశం ఉండగా, కొత్త టైమ్‌ టేబుల్‌ కోసం  ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు.

Read Also: 24 కోచ్‌లతో కొత్త వందే భారత్ స్లీపర్.. అయ్య బాబోయ్ ఇన్ని సౌకర్యాలా?

Tags

Related News

24 కోచ్‌లతో కొత్త వందే భారత్ స్లీపర్.. అయ్య బాబోయ్ ఇన్ని సౌకర్యాలా?

ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న ఆర్టీసీ మెట్రో కామన్ పాస్ ఛార్జీలు!

కోల్‌కతాలోని రోడ్లకు ఇలా రంగులు ఎందుకు వేస్తున్నారు? దాని కోసమేనా?

ఏపీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. గుంటూరు నుంచి స్పెషల్ రైలు!

వందే భారత్ సరికొత్త రికార్డు.. 180 కిలోమీటర్ల వేగంతో ట్రయల్ సక్సెస్!

సౌదీ అరేబియాకు వెళ్లొద్దు.. హౌతీ దాడులతో పలు దేశాల హెచ్చరికలు!

పెంగ్విన్ల మలంతో కరుగుతున్న మంచు.. అంటార్కిటికాలో వింత పరిణామం!

Big Stories

Advertisement
×