E-Paper
Advertisement

కొత్త టీవీఎస్ రేడియాన్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే మతిపోవాల్సిందే!

కొత్త టీవీఎస్ రేడియాన్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే మతిపోవాల్సిందే!
Advertisement

New TVS Radeon 2026: ప్రముఖ టూవీలర్ కంపెనీ TVS మోటార్ తన రేడియాన్ 110cc బైక్‌ను కొత్త అప్‌ డేట్స్‌ తో మార్కెట్లోకి తీసుకొచ్చింది. పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ మోడల్‌లో ఆల్ LED లైటింగ్‌తో పాటు కొత్త కలర్ ఆప్షన్లను అందించింది. బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లు కోరుకునే కస్టమర్లను ఆకట్టుకునేలా ఈ బైక్‌ను అప్‌డేట్ చేసింది. 2026 TVS రేడియాన్ ప్రారంభ ధర రూ.67,100గా ఉండగా, టాప్ వేరియంట్ ధర రూ.73,100గా ఉంది.

ఆల్ LED లైటింగ్‌తో కొత్త లుక్

కొత్త TVS రేడియాన్‌లో ప్రధానంగా లైటింగ్ వ్యవస్థను అప్‌డేట్ చేశారు. ఇందులో సిగ్నేచర్ DRLతో కూడిన LED హెడ్‌లైట్, LED టెయిల్‌లైట్, LED టర్న్ ఇండికేటర్లను అందించారు. ఈ ఫీచర్లు బేస్ వేరియంట్ నుంచి టాప్ వేరియంట్ వరకు అన్ని మోడళ్లలో స్టాండర్డ్‌ గా ఉంటాయి. అయితే, బైక్ మొత్తం డిజైన్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. కొత్త కలర్ ఆప్షన్ల ద్వారా బైక్‌కు ఫ్రెష్ లుక్ తీసుకొచ్చారు.

మూడు వేరియంట్లు.. ధరల వివరాలు..

Advertisement

2026 TVS రేడియాన్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వాటి ధరలను పరిశీలిస్తే, బేస్ వేరియంట్ రూ.67,100, డిజి-డ్రమ్ వేరియంట్ రూ.70,100, డిజి డిస్క్ వేరియంట్ రూ.73,100కు లభిస్తోంది. పాత మోడల్‌తో పోలిస్తే బేస్ వేరియంట్ ధర రూ.1,250 పెరిగింది. మరోవైపు, టాప్ డిజి-డిస్క్ వేరియంట్ ధర రూ.7,500 తగ్గింది.

కొత్త కలర్ ఆప్షన్లు

కొత్త రేడియాన్‌లో వేరియంట్‌ను బట్టి పలు కలర్స్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు. బేస్ మోడల్ బ్లాక్ అండ్ బ్లూ, బ్లాక్ అండ్ రెడ్ రంగుల్లో లభిస్తుంది. డిజి డ్రమ్ వేరియంట్‌ లో బ్లాక్ అండ్ రెడ్, బ్లాక్ అండ్ ఆరెంజ్, రెడ్ అండ్ బ్లాక్ DT కలర్స్ ఉన్నాయి. టాప్ డిజి డిస్క్ వేరియంట్‌ లో బ్లాక్ అండ్ ఆరెంజ్, రెడ్ అండ్ బ్లాక్ DT రంగులను అందిస్తున్నారు.

ఇంజన్‌ లో నో ఛేంజెస్

Advertisement

ఈ బైక్‌లో పాత 110cc ఎయిర్/ఆయిల్ కూల్డ్ ఇంజన్‌ నే కొనసాగించారు. ఇది 8hp పవర్, 8.7Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 4-స్పీడ్ గేర్‌ బాక్స్‌ ను యాడ్ చేశారు. అంటే, కొత్త మోడల్‌ లో కీలక మార్పులు ఫీచర్లు, లైటింగ్, రంగులకే పరిమితమయ్యాయి. 2026 TVS రేడియాన్ మైలేజ్ లీటర్‌కు సుమారు 63 నుంచి 74 కిలోమీటర్లుగా ఉంటుంది. అయితే, ఇది వేరియంట్, రైడింగ్ పరిస్థితులు, ట్రాఫిక్‌ను బట్టి మారుతుంది. ఫ్యూయల్ ట్యాంక్ 10 లీటర్లుగా ఉంటుంది.

వేటితో పోటీ పడుతుందంటే..

TVS రేడియాన్‌లో USB ఛార్జింగ్, కలర్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డిస్క్ బ్రేక్ ఆప్షన్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ విభాగంలో హోండా లివో, బజాజ్ CT 110X, ప్లాటినా 110 వంటి బైక్‌లకు ఇది పోటీ ఇస్తుంది.

Read Also: సింగిల్ ఛార్జ్ తో 250 కి.మీ రేంజ్.. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది!

Tags

Related News

టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్ టీజ్.. కొత్త లుక్‌ తో అదిరిపోయే ఎంట్రీ!

సింగిల్ ఛార్జ్ తో 250 కి.మీ రేంజ్.. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది!

జస్ట్ రూ.2,499కే సూపర్ బైక్.. యమహా అదిరిపోయే పండుగ ఆఫర్లు!

అమ్మకాల్లో దుమ్మురేపిన టాప్ 10 కార్లు.. సెప్టెంబర్ లో నెంబర్ వన్ ఏదంటే?

దీపావళికి ఫ్యామిలీ కార్ కొనాలా? రూ.10 లక్షల లోపు 5 క్రేజీ సెవెన్ సీటర్ కార్లు ఇవే!

ఈ దీపావళికి సన్‌ రూఫ్ కార్ కొనాలనుకుంటున్నారా? రూ.15 లక్షల లోపు 5 బెస్ట్ కార్లు ఇవే!

హైదరాబాద్‌లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ.. ఎలక్ట్రిక్ బైక్ ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×