BigTV English

Metro Police Hotel : మెట్రో పోలీస్ యజమాని అరెస్ట్, హోటల్ సీజ్, హైదరాబాద్ పోలీసులు, ముంబయికి వెళ్లి మరీ ?

Metro Police Hotel : మెట్రో పోలీస్ యజమాని అరెస్ట్, హోటల్ సీజ్, హైదరాబాద్ పోలీసులు, ముంబయికి వెళ్లి మరీ ?

Metro Police Hotel : సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ గుడిలో విగ్రహం ధ్వంసం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వ్యక్తిత్వ వికాసం పేరుతో కొందరు యువకులకు స్పెషల్ క్లాసులు నిర్వహించారు. ఇందులో భాగంగానే మెట్రో పోలీస్ హోటల్ లో మునావర్‌, యువకులను రెచ్చగొట్టారని పోలీసులు పేర్కొన్నారు.


రషీద్, మేనేజర్ అరెస్ట్…

ఫలితంగా మెట్రో పొలిస్‌ హోటల్‌ యజమాని రషీద్‌, మేనేజర్‌ రెహమాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. యువకులకు పాఠాలు బోధించిన నిందితుడు మునావర్‌ కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఇక హోటల్ యజమాని రషీద్‌ను ముంబయిలో అరెస్ట్ చేశామన్నారు.


రంగంలోకి తాహసీల్దార్…

సికింద్రాబాద్‌లోని మెట్రో పొలీస్‌ హోటల్ కు ఇప్పటికే రెవెన్యూ అధికారులు తాళం వేసి సీజ్‌ చేశారు. హోటల్‌ను మత విద్వేషాలకు వేదికగా చేసుకున్నారంటూ పోలీసులు ఇచ్చిన సిఫార్స్ మేరకు మండల అధికారులు తమ అధీనంలోకి తీసుకున్నారు.

ప్రాథమిక ఆధారాలున్నాయి…

వ్యక్తిత్వ వికాస శిక్షణ కోసం వచ్చిన ఓ వ్యక్తి, అక్కడి వారి ప్రసంగాలకు ప్రేరేపితుడయ్యాడని పోలీసులు దర్యాప్తులో స్పష్టమైంది. మెట్రో పొలిస్‌ హోటల్‌ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వేదికగా మారిందని పోలీసులు అంటున్నారు. దీనిపై ప్రాథమికంగా తమ వద్ద ఆధారాల ఉన్నాయన్నారు.

హోటల్ వేదికగా విద్వేష ప్రసంగాలు…

నెల రోజులుగా హోటల్ వద్ద మత విద్వేష ప్రసంగాలు జరిగాయని విచారణలో తేలిందన్నారు. ఈ నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తర మండలం డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్, సికింద్రాబాద్‌ ఆర్డీఓకు సూచించారు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్‌ తహసీల్దార్‌ పాండునాయక్, పోలీసులతో కలిసి గురువారం హోటల్‌ గదుల్లో ఉన్న వారిని ఖాళీ చేయించారు. అనంతరం హోటల్‌లోని రికార్డులను స్వాధీనం చేసుకుని హోటల్‌ను సీజ్‌ చేశారు.

Also Read : పాచిన పిండి, కుళ్లిన ఉల్లి.. ‘చట్నీస్’లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. పలు హోటల్స్ బంద్..

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×