E-Paper
Advertisement

Hyderabad police order: హైదరాబాద్ సిటీలో ఆంక్షలు, నెల రోజులపాటు వాటిపై నిషేధం

Hyderabad police order: హైదరాబాద్ సిటీలో ఆంక్షలు, నెల రోజులపాటు వాటిపై నిషేధం
Advertisement

Hyderabad police order: హైదరాబాద్ సిటీలో నెలరోజుల పాటు ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.  ముఖ్యంగా నగరంలో సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు నిషేధించినట్లు పేర్కొన్నారు.

ఐదుగురికి మించి గుమికూడితే చర్యలు ఉంటాయన్నది ప్రధాన హెచ్చరిక. సిటీలో అశాంతిని సృష్టించడానికి పలు సంస్థలు, పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విశ్వసనీయ సమాచారం ఉందన్నారు.

Advertisement

ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఎలాంటి ఆందోళనలు, ధర్నాలు నిర్వహించడానికి వీల్లేదన్నది అసలు పాయింట్. ఈ లెక్కన 144 సెక్షన్ అమల్లోకి వచ్చేసింది. U/S 163 BNSయాక్ట్ ప్రకారం నవంబర్ 28 వరకు ఆంక్షలు అమలు చేస్తారన్నారు. పోలీసు ఆదేశాలను గమనించిన అందరూ నడుచుకోవాలని సూచన చేశారు.

ALSO READ: జన్వాడ ఫాంహౌజ్ కేసు.. తీగలాగుతున్న పోలీసులు

Advertisement

అక్టోబరు 27 సాయంత్రం ఆరు గంటల నుంచి నవంబర్ 28 వరకు ఈ అంక్షలు అమల్లో ఉండనున్నాయి. అయితే ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద శాంతి యుత నిరసనలు, ధర్నాలకు మాత్రం అనుమతి ఉంటుందని ఆయా ఉత్తర్వుల్లో ప్రస్తావించారు.

హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో అంతటా నిరసన ప్రదర్శలకు బ్రేక్ పడినట్లైంది. పార్టీల ముసుగులు కొందరు అలజడి సృష్టించేందుకు ప్లాన్ చేసినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నమాట.

 

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×