E-Paper
Advertisement

Hyderabad: తాళ్లతో కట్టేసి, నోటికి ప్లాస్టర్.. రిటైర్డ్ కల్నల్ ఇంట్లో నేపాలీ గ్యాంగ్ బీభత్సం

Hyderabad: తాళ్లతో కట్టేసి,  నోటికి ప్లాస్టర్.. రిటైర్డ్ కల్నల్ ఇంట్లో నేపాలీ గ్యాంగ్ బీభత్సం
Advertisement

Hyderabad:నగరంలో దొంగతనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నమ్మకంగా ఇంట్లో పనికి చేరి, యజమానులకే ద్రోహం తలపెడుతున్న ఘటనలు పునరావృతమవుతున్నాయి. గతంలో సైబరాబాద్, హైదరాబాద్ పరిధిలో రెచ్చిపోయిన నేపాలీ ముఠాలు, అందినకాడికి దోచుకెళ్లిన ఉదంతాలు మరువకముందే, తాజాగా సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో అలాంటి ఘటనే వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళితే, కార్ఖానా ప్రాంతంలో నివాసముంటున్న రిటైర్డ్ ఆర్మీ కల్నల్ గిరి ఇంట్లో కొన్ని రోజుల క్రితం నేపాల్‌కు చెందిన దంపతులు పనిలో చేరారు. ఇంట్లో భారీగా డబ్బు, నగలు ఉన్నాయని సమాచారం తెలుసుకున్న ఆ దంపతులు, నిన్న అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో తమ అసలు స్వరూపాన్ని బయటపెట్టారు.

Advertisement

Read Also: Venkaiah Naidu: ‘పదవి విరమణ’ మాత్రమే చేశానని, ‘పెదవి విరమణ’ చేయలేదని వెంకయ్య నాయుడు చమత్కారం

కల్నల్ గిరిని తాళ్లతో కట్టేసి, ఆయన మూతికి ప్లాస్టర్ వేశారు. అనంతరం ఇంట్లో ఉన్న 25 తులాల బంగారు ఆభరణాలు, 23 లక్షల రూపాయల నగదు దోచుకుని పరారయ్యారు. ఉదయం ఎంతసేపటికీ గిరి బయటికి రాకపోవడంతో, అనుమానం వచ్చిన పక్కింటి వారు లోపలికి వెళ్లి చూడగా, ఆయన చేతులు, కాళ్లు కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేసి ఉండటం గమనించారు.

Advertisement

వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి (స్పాట్‌కు) చేరుకుని, పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. నిందితులైన నేపాలీ దంపతులు ఎప్పటి నుంచి పని చేస్తున్నారు, వారి పూర్తి వివరాలు ఏమిటి అనే కోణంలో ఆరా తీస్తున్నారు. వారు ఎటువైపు పారిపోయారనే దానిపై సమాచారం సేకరిస్తూ, దర్యాప్తు ముమ్మరం చేశారు.

Related News

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

Big Stories

Advertisement
×