OTT Movie : క్షుద్ర పూజలతో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆత్మలు, దయ్యాల స్టోరీ లతో, ఇవి ఎప్పటికీ కొత్త గానే అనిపిస్తాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే మూవీలో, చనిపోయిన వాళ్ళ ఆత్మలను క్షుద్ర పూజలతో తిరిగి తెచ్చి మళ్ళీ బ్రతికిస్తారు. ఈ స్టోరీ కాస్త భయపెట్టే విధంగానే ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే ..
జీ 5 (Zee 5) లో
2024 ఆగస్టు 2న విడుదలైన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘బర్దోవి’ (Bardovi). దీనికి కరణ్ శివాజీరావ్ చవాన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ అనంత్ అనే మధ్యవయస్కుడి చుట్టూ తిరుగుతుంది. అతను శవ వాహన డ్రైవర్‌గా పనిచేస్తూ, శవాలను శ్మశానానికి తీసుకువెళ్తాడు. ఈ మూవీ మనిషి మనస్తత్వం, మరణం తర్వాతి జీవితం రహస్య శక్తుల గురించి లోతుగా ఆలోచింపజేస్తుంది. ఇది థ్రిల్లర్ సినిమా కంటే ఎక్కువగా, ప్రేక్షకులను ఆలోచింపజేసే ఒక పజిల్‌లాంటి అనుభవాన్ని అందిస్తుంది. ఈ మూవీలో చాయా కదం, విరాట్ మడ్కే కీలక పాత్రల్లో నటించారు. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ ఫ్లాట్ జీ 5 (Zee 5) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
అనంత్ రోజువారీ జీవితంపై ఆసక్తి చూపకుండా ఒంటరిగా జీవిస్తాడు. అతను ఎప్పుడూ మరణం పట్ల ఎక్కువగా ఆసక్తిని కలిగి ఉంటాడు. తన బాల్యం గురించి అతనికి ఎక్కువగా గుర్తులేదు. అతను తాను ఎవరు అనే విషయంలో కూడా సందేహాలు కలిగి ఉంటాడు. అతను నగరానికి దూరంగా అడవుల్లో నివసిస్తూ, తాను తీసుకువెళ్ళే మృతుల ఆత్మలను విముక్తి చేయడంలో సమయం గడుపుతాడు. అనంత్‌కు తన తల్లి, అక్క గురించి కలలు తరచూ వస్తాయి. అనంత్ తల్లిఒక ప్రమాదంలో మరణించిందని అతని మామ దాదుబా చెబుతాడు. ఆమె మరణం తర్వాత అనంత్‌ను దాదుబానే పెంచుతాడు. అయితే ఒక రోజు అనంత్‌కు తన తల్లి విషయంలో, దాదుబా ఏదో రహస్యమైన విషయం దాచి పెడుతున్నాడని తెలుస్తుంది. అతని తల్లి, అక్క క్షుద్ర పూజల రహస్య జ్ఞానాన్ని కలిగి ఉన్నారని తెలుసుకుంటాడు. వాటిని అతనిపై ప్రయోగించారని కూడా కనుగొంటాడు.
ఈ రహస్యం ‘బర్దోవి గ్రంథం’ అనే ఒక పుస్తకానికి సంబంధించినదిగా ఉంటుంది. ఇది శక్తిని, రహస్య విషయాలపై నియంత్రణను పొందేందుకు సంబంధించినది. దీని ద్వారా అనంత్ తన తల్లి గురించి దాదుబా చెప్పినవన్నీ అబద్ధమని తెలుసుకుంటాడు. తన కలల అర్థం ఏమిటి? తనపై జరిగిన ప్రయోగంలో నిజం ఎంత ? ఈ చిక్కు ముడులకు సమాధానం లభిస్తుందా ? ఈ విషయాలు తెలుసుకోవాలంటే, జీ 5 (Zee 5) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘బర్దోవి’ (Bardovi) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి. ఈ స్టోరీ జననం, మరణం, పునర్జన్మల మధ్య ఉన్న సంబంధాలను వెలికితీస్తూ ముందుకు సాగుతుంది. ఇది రియాలిటీ, కలల మధ్య అస్పష్టమైన గీతలను అన్వేషిస్తుంది. ఈ మూవీలో ముఖ్యంగా నటన, దర్శకత్వం, హర్రర్ అంశాలకు ప్రశంసలు లభించాయి.