E-Paper
Advertisement

హైదరాబాద్ వాహనదారులకు అలెర్ట్.. ఈ రూట్‌లో ట్రాఫిక్ మళ్లింపులు.. ఆ రోడ్లు క్లోజ్!

హైదరాబాద్ వాహనదారులకు అలెర్ట్.. ఈ రూట్‌లో ట్రాఫిక్ మళ్లింపులు.. ఆ రోడ్లు క్లోజ్!
Advertisement

Hyderabad traffic: హైదరాబాద్ నగరంలో కీలకమైన మౌలిక వసతుల కల్పన దిశగా మరో అడుగు పడింది. నల్గొండ ఎక్స్ రోడ్స్ నుండి ఒవైసీ జంక్షన్ మధ్య ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు శరవేగంగా పుంజుకుంటున్నాయి. ఇందులో భాగంగా సైదాబాద్ వై జంక్షన్ నుంచి యాదగిరి థియేటర్ వరకు ఒకవైపు క్యారేజ్‌వేను పూర్తిగా మూసివేసి పనులు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు భారీ స్థాయిలో ట్రాఫిక్ మళ్లింపులు (Traffic Diversions) ప్రకటించారు. ఈ ఆంక్షలు జూలై 1 వరకు అమలులో ఉంటాయి.

వాహనదారులు అలర్ట్.. ఈ రూట్లలో భారీ రద్దీ!
నిర్మాణ పనుల కారణంగా చుట్టుపక్కల ఉండే రోడ్లు, ప్రధాన కూడళ్లలో తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా నల్గొండ ఎక్స్ రోడ్స్, ఒవైసీ హాస్పిటల్ మధ్య ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బందులు పడకుండా ఉండేందుకు, వీలైనంత వరకు ఈ మార్గాన్ని నివారించాలని పోలీసులు స్పష్టం చేశారు. ప్రయాణికులు తమ సమయాన్ని ఆదా చేసుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం ఉత్తమం.

Advertisement

భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సుల మళ్లింపు…
నల్గొండ ఎక్స్ రోడ్స్ నుండి సంతోష్ నగర్, ఐఎస్ సదన్ వైపు వెళ్లే నాలుగు చక్రాల వాహనాలు, ఆర్టీసీ బస్సులు, భారీ సరుకు రవాణా వాహనాలను సైదాబాద్ వై జంక్షన్ వద్ద మళ్లించనున్నారు. ఈ వాహనాలు డీసీపీ సౌత్ ఈస్ట్ జోన్ కార్యాలయం, సైదాబాద్ పోలీస్ స్టేషన్, సరస్వతి నగర్ కమాన్, సంకేశ్వర్ బజార్, సింగరేణి కాలనీ, ఓనస్ రోబోటిక్ హాస్పిటల్, చంపాపేట్ మీదుగా ప్రయాణించి, చివరకు DMRL రోటరీకి చేరుకోవాల్సి ఉంటుంది.

ద్విచక్ర, త్రిచక్ర వాహనదారుల కోసం చిన్న గల్లీల రూట్ మ్యాప్!
చంచల్‌గూడ వైపు నుండి ఐఎస్ సదన్ వెళ్లే టూ వీలర్స్, ఆటోలను సైదాబాద్ వై జంక్షన్ వద్ద మళ్లిస్తారు. ఈ వాహనాలు సైదాబాద్ పోలీస్ స్టేషన్, 105 బస్ స్టాప్, రామలయం కమాన్, లక్ష్మీ నగర్, దోబిఘాట్ మీదుగా ప్రయాణించి ఐఎస్ సదన్ మెయిన్ రోడ్డులోకి ప్రవేశిస్తాయి. అలాగే, చంచల్‌గూడ నుండి చంపాపేట్ వైపు వెళ్లే బైకులు, ఆటోలు సైదాబాద్ పోలీస్ స్టేషన్, రామలయం కమాన్, లక్ష్మీ నగర్, వినయ్ నగర్, భరత్ గార్డెన్ మీదుగా చంపాపేట్ ప్రధాన రహదారి, DMRL రోటరీకి చేరుకోవచ్చు.

Advertisement

చాదర్‌ఘాట్ రూట్‌లో వచ్చే భారీ వాహనాలకు లాంగ్ డైవర్షన్!
చాదర్‌ఘాట్ మీదుగా ఐఎస్ సదన్, చంపాపేట్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలకు నల్గొండ ఎక్స్ రోడ్స్ వద్దే రూట్ మార్చారు. ఇవి మలక్‌పేట్ గంజ్, మూసారంబాగ్ ఎక్స్ రోడ్స్, గడ్డిఅన్నారం, శివ గంగ థియేటర్, సరూర్‌నగర్ చెరువు సమీపంలోని హనీఫియా మసీదు, సింగరేణి కాలనీ, ఓనస్ హాస్పిటల్ మీదుగా ప్రయాణించి చంపాపేట్ మెయిన్ రోడ్డుకు చేరుకుంటాయి.

ప్లాన్ చేసుకోండి.. హెల్ప్‌లైన్ నంబర్ నోట్ చేసుకోండి!
నగరవాసులు తమ రోజువారీ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని, ట్రాఫిక్ పోలీసుల అధికారిక సోషల్ మీడియా అకౌంట్లను ఫాలో అవుతూ అప్‌డేట్స్ తెలుసుకోవాలని అధికారులు కోరారు. ప్రయాణంలో ఏదైనా అత్యవసర సహాయం లేదా సమాచారం కావాలనుకుంటే 9010203626 అనే ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించవచ్చు. నగర ప్రగతి కోసం జరుగుతున్న ఈ నిర్మాణ పనులకు వాహనదారులు, ప్రజలు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Also Read: మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. దిగొచ్చిన పసిడి, వెండి ధరలు.. నేటి మార్కెట్ రేట్లు ఇవే!

Related News

ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి హాట్ కామెంట్స్.. తమిళనాడు మాదిరి మార్పు ఎక్కడ?

తెలంగాణలో ‘సర్’ టెన్షన్.. 21 శాతం ఓట్లు పోయే ఛాన్స్, నేతలకు సీఎం రేవంత్ కీలక సూచనలు

తెలంగాణలో కొత్త స్మార్ట్ రేషన్‌కార్డులు.. ఎన్ని భద్రతలు తెలుసా? హోలోగ్రామ్‌ నుంచి మొదలు

వాళ్లు క్షుద్ర పూజలు చేశారు.. కానీ దేవుడు మన వైపే ఉన్నాడు! కూకట్‌పల్లిలో రేవంత్ సంచలనం!

స్వేచ్ఛ ఓకే.. విద్వేషం నాట్ ఓకే.. మంత్రి పొన్నం స్ట్రాంగ్ వార్నింగ్

బొగ్గు, సిమెంట్ ధరలపై కిషన్ రెడ్డి కీలక ప్రకటన.. రాష్ట్రాల హక్కులపై క్లారిటీ!

వీడెక్కడి దొంగరా బాబు.. దొంగతనం చేసిన ఇంట్రోనే నిద్రపోయాడు!

హిందూ ముస్లింలు నా రెండు కళ్లు.. మైనారిటీస్ ఎక్సలెన్స్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి!

Big Stories

Advertisement
×