Hyderabad Accident: ఇటీవల కాలంలో తరుచూ రోడ్డు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. యువత మద్యానికి బానిసై అరచేతిలో ప్రాణాలు పోగుట్టుకుంటున్నారు. తమ పిల్లలు ఉన్నత చదువులు చదవి పైస్థాయికి వెళ్తారని ఆశిస్తున్న తల్లితండ్రుల ఆశలు అడియాశలు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు.
హైదారాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని మాదాపూర్ పరిధిలోని అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్డులో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. మృతులను బోరబండకు చెందిన రఘుబాబు, ఆకాన్ష్‌గా గుర్తించారు. బైక్ నడుపుతున్న యువకుడు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.